Woman, Lover Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఆ తర్వాత అతడితో పెళ్లి
Woman, Lover Kill Husband | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించింది. కొన్ని రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించింది. కొన్ని రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman, Lover Kill Husband) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల పరమేష్ రోజువారీ కూలీ పనులు చేసేవాడు. జనవరి 29న రాత్రి వేళ అతడు గుండెపోటుతో మరణించినట్లు 46 ఏళ్ల భార్య ఆశా తన బంధువులను నమ్మించింది. ఆ మరునాడు పరమేష్ మృతదేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, ఒక ఇంట్లో పని చేస్తున్న ఆశా తన భర్త చనిపోయిన 20 రోజుల్లో మరో పెళ్లి చేసుకున్నది. వంట పని చేసే ప్రియుడైన 48 ఏళ్ల చంద్రప్పను ఫిబ్రవరి 19న రెండో వివాహం చేసుకున్నది. ఈ నేపథ్యంలో పరమేష్ సోదరీమణులు అతడి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఒక సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరోవైపు ఖననం చేసిన పరమేష్ మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీయించారు. పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించడంతోపాటు ఫోరెన్సిక్ నమూనాలు సేకరించారు. ఊపిరి ఆడకపోవడం వల్ల అతడు మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆశా, ఆమె ప్రియుడు చంద్రప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, మద్యం మత్తులో నిద్రించిన పరమేష్ ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఆశా, ఆమె ప్రియుడు చంద్రప్పను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
IRIS Lavan | ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడికి ముందు.. మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- heart attack
- Husband
- karnataka
- kill
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

