ఆంధ్రజ్యోతివి విషపు కోరలు
ఆంధ్రజ్యోతి వక్రీకరణ రాతలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. భావోద్వేగాల సం దర్భంలో విషాన్ని చిమ్మడం దారుమణమని మండిపడ్డారు. ఇది జర్నలిజం కాద ని హితవు పలికారు.
- ఆ పత్రికది ఆదినుంచీ చావుభాషే!
- పెద్ది కుటుంబ పరామర్శపై ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండించిన బీఆర్ఎస్ నేతలు
- భావోద్వేగ సందర్భంలోనూ కక్షతో విషం చిమ్మడం దారుణం: నిరంజన్‌రెడ్డి
- కేసీఆర్ అనని మాటలను ఆయనకు ఆపాదించడం జర్నలిజం కాదు: పల్లా
- వెంటనే పత్రికా యాజమాన్యం క్షమాపణ చెప్పి తీరాలి: వై సతీశ్‌రెడ్డి
- ఆంధ్రజ్యోతి పత్రికను దహనం చేసిన నర్సంపేట వాసి, ఓయూ బీఆర్ఎస్వీ నేత
హైదరాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): ఆంధ్రజ్యోతి వక్రీకరణ రాతలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. భావోద్వేగాల సం దర్భంలో విషాన్ని చిమ్మడం దారుమణమని మండిపడ్డారు. ఇది జర్నలిజం కాద ని హితవు పలికారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే కేసీఆర్ పరామర్శించిన మానవీయ సందర్భంపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై బీఆర్ఎస్ నేత లు ఆగ్రహం వ్యక్తంచేశారు. భావోద్వేగ సందర్భాన్ని కూడా వక్రీకరించి రాతలు రాయడం బాధ్యతాయుత జర్నలిజం కాదని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తీవ్రం గా ఖండించారు. ‘ఆంధ్రజ్యోతిది ఆది నుంచి చావు భాషే’ అంటూ నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ‘పిల్లి శాపాలకు ఉట్లు తెగవు.. మీరెన్ని మరణమృదంగాలు మోగించినా అవి ఘోషగానే మిగిలిపోతాయి’ అని మండిపడ్డారు.
జర్నలిజం విలువలకు విరుద్ధం
కేసీఆర్ ఎకడా చెప్పని వ్యాఖ్యలను ఆయన అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ప్రచురించడాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎవరూ అనని మాటలను వార్తలుగా ప్రచురించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వార్తలు రాయడం జర్నలిజం విలువలకు విరుద్ధమని పేరొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసలు వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్యలను జోడించడం అభ్యంతరకరమని తెలిపారు.
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతుల దహనం
ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాన్ని నిరసిస్తూ నర్సంపేటకు చెందిన వ్యక్తి, ఓయూ బీఆర్ఎస్వీ నాయకుడు నాగేందర్ ఆ పత్రిక ్ర పతిని దహనం చేశారు. మానవీయ సందర్భా న్ని వక్రీకరిస్తూ కథనం రాశారంటూ సోమవారం ఆయన నిరసన వ్యక్తంచేశారు. కేసీఆర్ పై ఇష్టానుసారం వార్తలు రాస్తే సహించేది లేద ని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వార్తలు రాయడం ఆపకపోతే గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.
క్షమాపణ చెప్పాలి: వై సతీశ్‌రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక.. ఓవైపు సీఎం రేవంత్‌రెడ్డి, మరోవైపు ఆయన చెప్పు చే తల్లోని మీడియా.. కేసీఆర్ చావును కోరుకుంటున్నాయని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆక్షేపించారు. రేవంత్ పదుల సార్లు కేసీఆర్ చావు గురించి మాట్లాడారని, వయసులో పెద్ద వారనే గౌరవం కూడా లేకుండా ఇష్టమొచ్చిన ట్టు వాగుతున్నారని, ఆయన చేతుల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ పై తప్పుడు వార్తలు రాస్తూ.. శునకానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వార్తలు రాసేవారికి, రాయించేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తప్పుడు వార్తపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే మరోసారి ఉద్యమపౌరుషం రుచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆంధ్రజ్యోతి వార్త అభూత కల్పన
కేసీఆర్‌పై ఉన్న అక్కసు, ఆసూయకు ఆంధ్రజ్యోతి భాష నిదర్శనం అనిపిస్తున్నదని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాత్రమే కేసీఆర్ అన్నారని, కానీ, ఆయన అనని మాటలు అన్నట్టు వక్రీకరించారని విమర్శించారు. కేసీఆర్ అనని మాటలను అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఆపాదించి రాసిన వార్త చూసి తెలంగాణ సమాజం ఉలిక్కి పడిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. సమైక్యవాదులు, కాంగ్రెస్ నాయకులు ఎన్ని తిట్టినా కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రార్థనలతో, దేవుడి ఆశీర్వాదంతో నిండునూరేండ్లు జీవిస్తారని స్పష్టంచేశారు. ‘అన్నింటికీ జవాబు ఉంటది. ఆ జవాబు ఏ స్థాయిలో ఉంటదంటే.. ఎందుకు పెట్టుకున్నమురా.. ఎందుకు రాసినం రా.. అనే స్థాయిలో ఉంటంది’ అని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

