Polytechnic | పాలిటెక్నిక్ విలీనంపై యూటర్న్.. విద్యార్థుల ఉద్యమంతో దిగొచ్చిన సర్కార్..!
Polytechnic : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. జీవో 97ను నిరసిస్తూ విద్యార్థి లోకం నిర్వహించిన 37 రోజుల ఉద్యమంతో సర్కార్ దిగొచ్చింది.
Polytechnic : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. జీవో 97ను నిరసిస్తూ విద్యార్థి లోకం నిర్వహించిన 37 రోజుల ఉద్యమంతో సర్కార్ దిగొచ్చింది. దాంతో, వీలీనం నిర్ణయానికి బ్రేక్ పడింది. శక్తి శాఖలో ఉద్యోగుల కేటాయింపు విషయం కూడా ఇక్కడితో ముగిసినట్టే.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం కోసం జూలై 3వ తేదీన విడుదల చేసిన 97 జీవోపై విద్యార్థి, అధ్యాపక లోకం భగ్గుమనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శక్తి శాఖలో ఉద్యోగుల కేటాయింపు అంశంపై కూడా తీవ్ర నిరసను వ్యక్తమవ్వడంతో.. కేకే కమిటీ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది.
దాంతో, పాలిటెక్నిక్ విలీనం ప్రతిపాదనపై సర్కార్ యూటర్న్ తీసుకుంది. కాబట్టి పాత పద్ధతిలోనే డిప్లొమా విద్య.. సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కాలేజీల కొనసాగనున్నాయి. అలానే సాంకేతిక విద్యామండలి, ఏఐసీటీఈ విధానాలు యథాతథంగా ఉండనున్నాయి. దాంతో, 37 రోజుల విద్యార్థులు, అధ్యాపకుల పోరాటానికి ఫలితం దక్కింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

