Masoud Pezeshkian | అమెరికా వెళ్లబోతున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్.. కారణం ఇదే
Masoud Pezeshkian : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Masoud Pezeshkian : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇరాన్‌కు చెందిన మీడియా సంస్త టెహ్రాన్ టైమ్స్, ఇస్లామిక్ రిపబ్లిక్కు చెందిన తన్సిమ్ న్యూస్ ఏజెన్సీ పలు వివరాల్ని వెల్లడించింది. త్వరలో ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) జరగనుంది.
దీని కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఈ సదస్సుకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హాజరు కానున్నారు. త్వరలోనే ఆయన అమెరికా వెళ్తారని మీడియా సంస్తలు వెల్లడించాయి. అయితే, పెజెష్కియాన్ హాజరయ్యే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. నిజానికి పెజెష్కియాన్ ప్రతి ఏడాది ఈ సమావేశం కోసం న్యూయార్క్ వెళ్తారు. ఇరాన్ తరఫున మాట్లాడుతారు. ఈసారి కూడా ఆయన సమావేశానికి హాజరు కావాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, అమెరికా చర్యల గురించి వివరించే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం గురించి అంతర్జాతీయ సమాజానికి వివరించాలనుకుంటున్నారు.
ఇదే సమయంలో పలువురు ప్రపంచ నేతలను కూడా పెజెష్కియాన్ కలిసి చర్చలు జరుపుతారు. పెజెష్కియాన్ న్యూయార్క్ వెళ్లేటప్పుడు ఇరాన్‌కు చెందిన ఉన్నతాధికారులు, సైనికాధికారులు కూడా హాజరవుతారు. ఇప్పటికే పెజెష్కియాన్ సహా ఇరాన్ ప్రముఖులకు అమెరికా వీసాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య గత ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం జరుగుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెజెష్కియాన్ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

