Madaram : సింగరేణి మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు పుల్లారావు (42) గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన మరణించాడు. రెండు దశాబ్దాలుగా వైద్య సేవలందించిన పుల్లారావు అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. స్వస్థలం పెద్దమండవలో సోమవారం అంత్యక్రియలు చేపడతామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ముదిగొండ మండలం పెద్దమండవకు చెందిన పుల్లారావు పాతికేళ్ల కిందట మాదారం గ్రామానికి వచ్చి ఆర్ఎంపి వైద్యుడిగా పని చేస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ.. వైద్యం చేసిన పుల్లారావు గుండెపోటుతో మరణించడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆయన మృతితో మాదారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సర్పంచ్ ఉమా నరేష్‌తో పాటు గ్రామస్తులు పుల్లారావుకు నివాళులర్పించారు.
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు మాదారం పరిసర ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవనందించిన పుల్లారావు ఆకస్మిక మరణం తీరని లోటని పలువురు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మృతుని స్వగ్రామం పెద్ద మండవలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.