హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలల్లోనే ఉంచుకొని వేధిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 13న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో నిధులు అందలేదని విమర్శించారు.