F-15 Jet: సౌదీ ఎఫ్-15 యుద్ధ విమానం కూల్చివేత.. వీడియో రిలీజ్ చేసిన హౌతీలు
F-15 Jet: సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని హౌతీలు కూల్చివేశారు. స్థానికంగా తయారు చేసిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌తో ఆ ఫైటర్ జెట్‌ను షూట్ చేసినట్లు చెప్పారు. ఎఫ్-15కి చెందిన 4 నిమిషాల వీడియోను కూడా రిలీజ్ చేశారు.
సనా: సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని(F-15 Jet) .. యెమెన్‌లోని హౌతీలు కూల్చివేశారు. స్థానికంగా తయారు చేసిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌తో ఆ ఫైటర్ జెట్‌ను షూట్ చేసినట్లు చెప్పారు. శత్రు ఆపరేషన్స్ చేపడుతున్న సమయంలో దాన్ని కూల్చినట్లు పేర్కొన్నారు. మారిబ్ ప్రావిన్సులో ఆ విమానం కూలినట్లు హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యె సారే తెలిపారు. సౌదీ ఎఫ్-15 జెట్ కూల్చివేతకు చెందిన వీడియోను హౌతీలు రిలీజ్ చేశారు. రాత్రి వేళ ఆ యుద్ధ విమానాన్ని నేలకూల్చారు. ఇక దాని శిథిలాలను మారిబ్ ప్రావిన్సులో గుర్తించారు. సుమారు నాలుగు నిమిషాలు ఉన్న ఓ వీడియోను హౌతీలు రిలీజ్ చేశారు. జెట్‌ను టార్గెట్ చేసిన క్షణం నుంచి కింద పడి మంటలు, పొగ వ్యాపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. కొండలతో ఉన్న ఎడారి ప్రాంతంలో ఆ జెట్ పడింది. ఆ విమానం రెక్కపై సౌదీ ఎయిర్‌క్రాఫ్ట్ అని రాసి ఉన్నది. ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు కొందరు ఆ విమాన శిథిలాల వద్దకు చేరుకున్నారు.
مشاهد نوعية لإسقاط طائرة مقاتلة سعودية من نوع F15 وحطامها في محافظة مأرب – 16 سبتمبر 2026م pic.twitter.com/rk0suliePT
— الإعلام الحربي اليمني (@MMY1444) September 16, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

