ప్లేట్ భోజనం రూ.5,500
హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని వెచ్చించింది.
- ఐఆర్సీ సమ్మిట్‌లో విందు వైభోగం
- నాలుగు రోజులకు 11 కోట్లు ఖర్చు
- అసలు లక్ష్యాన్ని అటకెక్కించిన సర్కార్
- మండిపడుతున్న పౌరసంఘాలు
- దుబారాపై విచారణకు డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని వెచ్చించింది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఈ సదస్సుకు హాజరైన దాదాపు 5 వేల మంది ప్రతినిధులకు భోజన ఏర్పాట్ల కోసం ప్లేట్‌కు రూ.5,500 చొప్పున 4 రోజులకు కలిపి ఏకంగా రూ.11 కోట్లు ఖర్చు చేసింది. ఈ సదస్సుకు తెలంగాణ నుంచి కొద్దిమంది మాత్రమే ప్రతినిధులు హాజరయ్యారు.
వీరి సంఖ్య కంటే మీడియా ప్రతినిధులే అధికంగా ఉన్నారు. ఇంత పెద్ద సదస్సును రాష్ట్ర ఇంజినీర్లకు, స్థానిక నిపుణులకు ఉపయోగపడేలా చేయడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల అధికారులకు రాచమర్యాదలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించింది. కీలక అంశాలపై చర్చలు నిర్వహించడం కంటే అతిథిలకు లగ్జరీ సదుపాయాలు కల్పించడం, గాలా పార్టీలు, విందులు, వినోదాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణ సంసృతి, సంప్రదాయాల పేరుతో అతిథులను అలరించేందుకు ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరుల ఏర్పాటుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
దీంతో పగటిపూట ఖాళీగా కనిపించిన సమావేశ మందిరాలు.. రాత్రిపూట గాలా డిన్నర్లు, సాంసృతిక కార్యక్రమాలతో కిటకిటలాడాయి. సదస్సు అసలు ఉద్దేశాన్ని పకనపెట్టి ప్రభుత్వం ఆర్భాటాలకు పోవడం, సామాన్యులు కష్టపడి చెల్లించిన పన్నుల సొమ్మును విందులు, వినోదాల కోసం దుర్వినియోగం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఒకవైపు కరువు, సాగునీటి ఇబ్బందులతో రైతులు తీవ్రంగా అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఆర్భాటాలకు పోవడం, రైతులకు ఇవ్వాల్సిన నిధుల్లో కోతలు విధిస్తూ అతిథుల ఆతిథ్యం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏంటని పౌరసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని, దుబారా ఖర్చులకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
విదేశీ కంపెనీల ప్రచారం కోసమే..
ఐఆర్సీ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లు కేవలం బడా కాంట్రాక్టర్లు, విదేశీ కంపెనీల వ్యాపార ప్రచారానికి మాత్రమే వేదికగా మారాయి. రహదారి నిర్మాణ పరికరాల ఎగుమతి, దిగుమతుల ఒప్పందాల చుట్టూనే ప్రైవేట్ సంస్థల లాబీయింగ్ నడిచింది. విదేశీ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారే తప్ప, దేశీయంగా తకువ ఖర్చుతో నాణ్యమైన రోడ్లు వేసే విధానాలపై దృష్టి పెట్టలేదు. కేవలం సాంకేతిక సదస్సులు, ప్రసంగాల పేరుతో కాలక్షేపం చేయడమే తప్ప రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు కనీసం ఒక్క తీర్మానం కూడా చేయలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

