ఫైనల్లో ఓడినా జ్వెరెవ్‌దే నంబర్ వన్
సీజన్ ఎండింగ్ ఏటీపీ ఫైనల్ టోర్నమెంట్ తుదిపోరులో ఓడినా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన నంబర్ వన్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్.. 6-2, 7-6 (9/7)తో జ్వెరెవ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
- అల్కరాస్‌కు ఏటీపీ టైటిల్
టురిన్: సీజన్ ఎండింగ్ ఏటీపీ ఫైనల్ టోర్నమెంట్ తుదిపోరులో ఓడినా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన నంబర్ వన్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్.. 6-2, 7-6 (9/7)తో జ్వెరెవ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
ట్రోఫీ గెలవడం ద్వారా అల్కరాస్.. పిన్న వయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను నెగ్గిన (అగస్సీ, ఫెదరర్, జొకోవిచ్ తర్వాత) నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఫైనల్లో పరాభవం పాలైనప్పటికీ జ్వెరెవ్ మాత్రం నంబర్ వన్ ర్యాంకును కోల్పోలేదు. ఈ సీజన్ ఆసాంతం నిలకడగా ఆడిన జ్వెరెవ్ సోమవారం విడుదలైన జాబితాలో జ్వెరెవ్ 10,350 పాయింట్లతో ఏడాదిని అగ్రస్థానంతో ముగించాడు. రెండో స్థానంలో ఉన్న యానిక్ సినర్ (ఇటలీ) కు 7,950, థర్డ్ ప్లేస్‌లో అల్కరాస్‌కు 7,600 పాయింట్లున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

