మత్స్యకారులకు 5 లక్షల బీమా
రాష్ట్రంలోని మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో అర్హులైన 4,21,767 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం(జీఏఐఎస్) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
- రాష్ట్రంలో అర్హులైన 4.21 లక్షల మందికి అవకాశం
- మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో అర్హులైన 4,21,767 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం(జీఏఐఎస్) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. 18 నుంచి 70 ఏండ్ల మధ్య వయస్సుగల వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఒకో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా.. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు, చికిత్సకు రూ.25,000 వరకు అందించనున్నట్టు మంత్రి శ్రీహరి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

