Dhanush | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘రాయన్’ (Raayan) కు ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ వేడుకల అనంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పయణమవుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు.
ఈ సందర్భంగా అక్కడున్న ఒక మీడియా రిపోర్టర్ సరదాగా ధనుష్‌ను ఉద్దేశించి, తమిళంలో Katchi eppo namma start panna porom? (మనం రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తున్నాం?) అని ప్రశ్నించారు. సీఎం విజయ్ తర్వాత ధనుష్ కూడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వార్తల సందర్భంగా ఈ ప్రశ్నను రిపోర్టర్ అడిగారు. అయితే ఈ ఊహించని ప్రశ్నకు ధనుష్ ఎలాంటి సీరియస్ వ్యాఖ్యానాలు చేయకుండా, కేవలం చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు ధనుష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Dhanush‘s Reaction when a Press member asked, “Katchi Epo namma Start panna porom..❓” 😄💥pic.twitter.com/5Q95Ri0uKB
— Laxmi Kanth (@iammoviebuff007) September 23, 2026