Red Alert | ఈ రాత్రికి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్..!
Red Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ (బుధవారం) రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరంలో విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటనుంది.
Red Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ (బుధవారం) రాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరంలో విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో బుధవారం తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కొన్నిచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం కూడా పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు కొనసాగుతాయని స్పష్టంచేసింది.
మరోవైపు రాజధాని హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో సెప్టెంబర్ 26 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, కూకట్పల్లి, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయవద్దని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

