హోంగార్డులపై వేటు!
- ఆర్టీఏలో ఐదేండ్లు నిండిన వారు తక్షణమే మరో శాఖకు
ఐదేండ్లు నిండిన హోంగార్డులను తక్షణమే మరో శాఖకు పంపించాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయాల వారీగా లెక్కలు తీస్తున్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయం, యూనిట్ కేంద్రాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో ఏండ్లుగా పనిచేస్తున్న వందలమంది హోంగార్డుల వివరాలను రెడీ చేశారు. నగరంలో సుమారు 50 మందికి పైగా ఐదేండ్లు నిండిన హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొంతమంది హోంగార్డులు దళారులకు సహకరిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరడంతో కమిషనర్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఖాళీ అయ్యే వీరి స్థానాల్లో కొత్తవారిని కేటాయించాలని ఇప్పటికే అదనపు డీజీపీ (హోంగార్డ్స్)ను రవాణా శాఖ కమిషనర్ కోరారు. ఆర్టీఓ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలపై పర్యవేక్షణ బాధ్యత సంబంధిత అధికారులదే. ఏజెంట్లు కార్యాలయాల్లో ఎలా చెలామణి అవుతున్నారు? అక్రమ వసూళ్లు జరుగుతుంటే ఉన్నతాధికారులకు తెలియదా? ఇందులో హోంగార్డుల ప్రమేయం ఎంత వరకు ఉంటుంది? అనేది ఆలోచించాలని కొందరు హోంగార్డులు నమస్తే తెలంగాణతో తమ ఆవేదన పంచుకున్నారు.
ఆర్టీఓ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లు, డ్రైవింగ్ టెస్ట్‌లు, ఫిట్నెస్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏజెంట్ల ప్రమేయం, అక్రమ వసూళ్ల ఆరోపణలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో హోంగార్డుల పాత్ర ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవడంలో తప్పులేదని చెబుతున్నారు. ఏజెంట్ల వ్యవస్థ వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వారికి సహకరిస్తున్న ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంత అన్నది కూడా తేలాలని పలువురు హోంగార్డులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

