డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి
- అన్ని పార్టీలు, ఎంపీలకు కాక్రోచ్ జనతా పార్టీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నవంబర్ 28: పార్లమెంట్లో కేంద్రం ప్రతిపాదించనున్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. బిల్లు ఆమోదానికి సహకరించే ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడైనా ప్రజల తీర్పుకు ద్రోహం చేసినట్టేనని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దుల్లో అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా పక్షపాత మార్పులు జరిగే ప్రమాదం డీలిమిటేషన్ ప్రక్రియలో ఉన్నదని సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా ఆరోపించారు. బిల్లును సమర్థిస్తున్నవారు దాని అసలు ప్రభావాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీని ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాదని సీజేపీ నేత తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

