వృషకర్మతో ఆ కోరిక తీరింది
“వృషకర్మ’ ఓ డిఫరెంట్ అటెంప్ట్. మా కంఫర్ట్ జోనర్ నుంచి బయటకొచ్చి, ఎప్పుడూ చూడని కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్‌కి ఇవ్వాలనే ప్రయత్నంతో కష్టపడి చేసిన సినిమా ఇది. కథనీ, డైరెక్టర్ కార్తీక్ విజన్నీ నమ్మి ఈ సినిమా చేశా. షూటింగ్ మొదలయ్యాక ఒక దశలో ‘వృషకర్మ’ ప్రపంచంలోకి వెళ్లిపోయాను. తను ఏం చెబితే అది చేశాను. సినిమా అవుట్‌పుట్ చూశాక చెప్పలేనంత ఆనందం కలిగింది. ఒక లార్జర్ స్కేల్ సినిమా చేయాలనే నా కోరిక ‘వృషకర్మ’తో తీరింది. డిసెంబర్ 4న వస్తున్నాం. ట్రైలర్‌ని మించి సినిమా ఉంటుంది’ అని కథానాయకుడు నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిక్షన్ డ్రామా ‘వృషకర్మ’. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్లో నాగచైతన్య మాట్లాడారు. ‘ఇది ఓ రకమైన హారర్ సినిమా. గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది వెండితెరపైనే చూడాలి. అంచనాలకు మించి, తెలుగు సినిమా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని దర్శకుడు కార్తీక్ దండు తెలిపారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక మీనాక్షి చౌదరి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, స్పర్శ్ శ్రీవాస్తవ్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్రకుమార్, డీవోపీ రాగుల్ డి.హెరియన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వృషకర్మతో ఆ కోరిక తీరింది
మోహన రూపంతో సొగసులన్నీ ఒలకబోస్తూ నన్ను చేరడానికి వచ్చావా స్వామీ!
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

