మోహన రూపంతో సొగసులన్నీ ఒలకబోస్తూ నన్ను చేరడానికి వచ్చావా స్వామీ!
పద్మాల వంటి నీ పాదాల మీద నీ శరీరపు చల్లని చంద్రకాంతులు ప్రసరిస్తుండగా, చూసేవారి మనసులను దోచుకునే మోహన రూపంతో నీ సొగసులన్నీ ఒలకబోస్తూ నన్ను చేరడానికి వచ్చావా స్వామీ!’. ఇది కందుకూరి రుద్రకవి రచించిన జనార్దనాష్టకం లోనిది.
తెలంగాణ ప్రబంధ పరిమళం
మోహము తీర్చవా.. మోహనా!
సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా
చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా
మురువు జూపుచు వచ్చినావో మోహనాకృతి మీరగా
గరుడవాహన దనుజమర్దన కందుకూరి జనార్దనా!
ఈ పద్యం కందుకూరి రుద్రకవి రచించిన జనార్దనాష్టకం లోనిది. గోల్కొండను పాలించిన ఇబ్రహీం కుతుబ్ షాచే చింతలపాలెం అనే గ్రామం బహుమతిగా పొందినాడు ఈ కవి. దాదాపు క్రీ.శ.1550 కాలానికి చెందినవాడు. ఇతను సాహిత్య చరిత్రలో రెండో రుద్రకవి. కృష్ణదేవరాయల కాలంలో మొదటి రుద్రకవి ఉండేవాడని ఆరుద్ర గారు చెప్పారు. మకుట నియమం గల ఎనిమిది పద్యాల మాలికను అష్టకం అంటారు. రుద్రకవి జనార్దనాష్టకం ప్రాచీన శృంగారాష్టకం. దీని ఛందస్సు రడగ భేదం కాదు. మత్త కోకిలను మాత్రా ఛందస్సులోనికి మార్చి చేసిన రచన ఇది. మన ప్రస్తుత పద్యం జనార్దనాష్టకంలోని మొదటిది. నాయిక స్వాధీన పతిక.. ఈ పద్యంలో నాయిక తన ప్రియుడైన కందుకూరి జనార్దనుడి (శ్రీమహావిష్ణువు/కృష్ణుడి) దివ్య మంగళ రూపాన్ని చూసి మురిసిపోతూ వర్ణిస్తున్నది.
‘గరుత్మంతుని వాహనంగా కలవాడా! రాక్షసులను సంహరించినవాడా! ఓ కందుకూరి జనార్దనా! మెరిసే మేలిమి బంగారు పట్టు పీతాంబరం ఒకవైపు జారుతుండగా, పద్మాల వంటి నీ పాదాల మీద నీ శరీరపు చల్లని చంద్రకాంతులు ప్రసరిస్తుండగా, చూసేవారి మనసులను దోచుకునే మోహన రూపంతో నీ సొగసులన్నీ ఒలకబోస్తూ నన్ను చేరడానికి వచ్చావా స్వామీ!’ అని నాయిక తన ప్రియుడైన భగవంతుడి రాకను చూసి ఆనందంతో పలుకుతున్నది. ఈ పద్యంలో మధుర భక్తి కనిపిస్తుంది. భక్తురాలు తనను తాను ప్రియురాలిగా, భగవంతుడిని ప్రియుడిగా భావించుకుంటూ ఆయన అలంకారాన్ని, నడకలోని సొగసును అత్యంత రమణీయంగా కండ్లకు కట్టినట్లు వర్ణించింది. తన కోసం ఆలస్యం చేయకుండా గరుడ వాహనంపై వేంచేస్తున్నాడు. తమ ప్రియుడిని తమ ప్రేమతో, రూపలావణ్యాలతో పూర్తిగా వశపరచుకుని, ఎప్పుడూ తమ అధీనంలో ఉంచుకునే నాయికను స్వాధీనపతిక అంటారు. ఇక్కడ నాయిక వేరే ఎవరి దగ్గరికీ వెళ్లకుండా, తన కోసమే అందంగా ముస్తాబై నేరుగా తన వద్దకు వస్తున్న జనార్దనుడిని చూసి గర్వంతో, ఆనందంతో ‘మురువు జూపుచు వచ్చినావో…’ అని అంటున్నది.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వృషకర్మతో ఆ కోరిక తీరింది
మోహన రూపంతో సొగసులన్నీ ఒలకబోస్తూ నన్ను చేరడానికి వచ్చావా స్వామీ!
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

