కనుపాపలను ఆవరించిన కన్నీటిపొర!
బాబును పరీక్షించిన సైకాలజిస్ట్ ఆ పిల్లాడిలోని ప్రేమ, కరుణలను అర్థం చేసుకొని తల్లిని పిలిచి అసలు విషయం వివరిస్తాడు. ఆ సందర్భంలో ఒక ‘కన్నీటి పొర’ అమె కనుపాలను ఆవరిస్తుంది. ఇది ప్రణయ వలయం పుస్తకం గురించి ఇస్తున్న సమీక్ష.
పుస్తక సమీక్ష
జీవన సందేశం
కొన్ని కథలు మన మనసును తడిపితే మరికొన్ని కథలు మనలోని బుద్ధిని మేల్కొలుపుతాయి. ఇంకొన్ని మనలోని మానవత్వాన్ని తట్టిలేపుతాయి. ఇవన్నీ కలగలిపిన కథల పుస్తకమిది. ఇందులో ఉన్న పదిహేను కథలు మన చుట్టూ జరిగిన సంఘటనలనే గుర్తుచేస్తాయి. బాల్యంలో తన తల్లిని నిత్యం హింసించే తండ్రిని చూసిన దివ్య.. తన భర్తనూ ఆ కోణంలోనే ఊహించుకుంటుంది. కానీ చివరికి భర్త మంచితనాన్ని అర్థం చేసుకొని తన ఆలోచనను మార్చుకునే తీరు ‘రంగుటద్దాల్లో’ కనిపిస్తుంది. చక్రధర్ ఓ జర్నలిస్ట్, రచయిత. ఫ్రెంచ్ విప్లవం గురించి చదివి స్ఫూర్తి పొందిన తనకు ఫ్రాన్స్ ఒలింపిక్స్ ముగింపు వ్యాసం రాయమని ఆ దినపత్రిక చెబుతుంది. సమాజంలో నెలకొన్న పరిస్థితులను చూసి కూడా రచయితగా మౌనం వహించడం, సమాజానికి ఉపయోగకరంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నానా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితే ‘ఎప్పటికీ రాని విప్లవం’. పిల్లలు దైవంతో సమానమంటారు. వారికి మూగజీవాలపైన, సాటి మనుషులపైన అపారమైన ప్రేమ దాగుంటుంది. స్నేహాల్ సైకాలజిస్ట్‌ను కలిసి పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టపడే తన బాబు ఈ మధ్య వాటిని దూరం పెడుతున్నాడని వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని చెబుతుంది.
మరునాడు బాబును పరీక్షించిన సైకాలజిస్ట్ ఆ పిల్లాడిలోని ప్రేమ, కరుణలను అర్థం చేసుకొని తల్లిని పిలిచి అసలు విషయం వివరిస్తాడు. ఆ సందర్భంలో ఒక ‘కన్నీటి పొర’ అమె కనుపాలను ఆవరిస్తుంది. పెండ్లయిన కొద్ది రోజులకే మ్యూచువల్ డైవర్స్‌కు దరఖాస్తు చేసుకుంటారు రిత్విక్, కావ్యలు. అయితే అవి మంజూరయ్యే వరకు వాళ్లు ఉంటున్న ఇంట్లోనే వేరుగా నివాసముంటూ ఎవరి ఉద్యోగం వాళ్లు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలోనే స్నేహితులుగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెడతారు. తెలియకుండానే ప్రేమికులుగా మారి తిరిగి వివాహ బంధంలోకి వెళ్తారు. ఆసక్తికరమైన ‘ప్రణయ వలయం’ కథ చదవాడనికి ముచ్చటగా ఉంటుంది. ఈ కథలన్నీటిలో మధ్యతరగతి జీవితాల్లో దాగి ఉన్న సత్యాలు ఆవిష్కృతమవుతాయి. మనిషిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే మరో అవకాశమే ఈ కథలు.
ప్రణయ వలయం (కథలు)
రచయిత: జాలాది రత్న సుధీర్
పేజీలు: 132, ధర: రూ. 150
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
న్యాయం-చట్టం-తీర్పులు అమలు తీరు
రచన: వై.వై. రెడ్డి యానాల
పేజీలు: 240; ధర: రూ.369
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
99089 79054

Justice Law Judgement Imple
– రాజు పిల్లనగోయిన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

