Internet services | డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు శాఖల్లో పౌర సేవలు, ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోయాయి. మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్ఆర్ఐ అసిస్టెన్సీ సెల్లోనూ ఇంటర్నెట్ పనిచేయలేదు. ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో అధికార యంత్రాంగంతో పాటు విజిటర్స్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం ఏంటని ఆయా పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే విజిటర్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? ఇంత పెద్ద వ్యవస్థలో ఇంటర్నెట్ సేవలు పని చేయకపోతే.. రాష్ట్రంలో పరిపాలన ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నిస్తున్నారు.