Jobs | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 521 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులను నింపనుంది. 22 స్పోర్ట్స్ విభాగాల నుంచి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
హెడ్‌కానిస్టేబుల్ (General Duty)- 182 (పురుషులు 150, మహిళలు 32)
కానిస్టేబుల్ (General Duty)- 339 (పురుషులు 258, మహిళలు 81)
విభాగాలవారీగా ఖాళీలు
1) ఆక్వాటిక్స్ (స్విమ్మింగ్, డ్రైవింగ్, వాటర్ పోలో)- 60
2) ఆర్చరీ- 3
3) అథ్లెటిక్స్- 101
4) బ్యాడ్మింటన్- 5
5) బాస్కెట్‌బాల్- 16
6) బాడీ బిల్డింగ్- 11
7) బాక్సింగ్- 20
8) ఫుట్‌బాల్- 22
9) జిమ్నాస్టిక్స్- 12
10) హ్యాండ్‌బాల్- 12
11) హాకీ- 15
12) జూడో- 16
13) కబడ్డీ- 27
14) కరాటే- 17
15) షూటింగ్- 53
16) తైక్వాండో- 14
17) వాలీబాల్- 20
18) వాటర్ స్పోర్ట్స (కయాకింగ్, కనోయింగ్, రోవింగ్)- 20
19) వెయిట్‌లిఫ్టింగ్- 19
20) వూషు- 20
21) రెజ్లింగ్- 26
22) యోగ (యోగాసన)- 12

Posts
అర్హతలు
హెడ్ కానిస్టేబుల్ (Head Constable)కు 10+2 లేదా తత్సమాన పరీక్ష గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులు కావాలి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో దేశం తరఫున ఆడి ఉండాలి. లేదా నేషనల్ గేమ్స్/చాంపియన్‌షిప్స్/ఇంటర్ యూనివర్సిటీ టోర్నీల్లో 1 నుంచి 3 స్థానాల్లో నిలిచి ఉండాలి.
కానిస్టేబుల్ (Constable)కు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జాతీయ స్థాయి చాంపియన్‌షిప్స్‌లో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం తరఫున లేదా ఖేలో ఇండియా/నేషనల్ స్కూల్ గేమ్స్‌లో ఆడి ఉండాలి.
వయసు
అభ్యర్థులు 18 నుంచి 23 ఏండ్లలోపు ఉండాలి. 2008, ఆగస్టు 1 తరువాత జన్మించి ఉండకూడదు. అన్రిజర్వ్డ్ క్రీడాకారులకు 5, ఓబీసీల(Non-Creamy Layer)కు 8, ఎస్సీ, ఎస్టీలకు 10, ఎక్స్ సర్వీస్‌మెన్ (UR)లకు 8, ఎక్స్ సర్వీస్‌మెన్ (ఓబీసీ)లకు 11, ఎక్స్ సర్వీస్‌మెన్ (ఎస్సీ, ఎస్టీ)లకు 13 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి.
ఎంపిక
డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, డిటెయిల్డ్/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. సాధించిన పతకాన్ని బట్టి మార్కులు కేటాయించి మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు.

General Duty
జీతం
ఎంపికైనవారికి నెలకు హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు రూ. 25,500-81,000, కానిస్టేబుల్ పోస్టుకు రూ. 21,700-69,100 ఉంటుంది.
దరఖాస్తు
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12న ప్రారంభమవుతుంది. నవంబర్ 11న ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ https//rect.crpf.gov.in చూడండి.