Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
Girls Sucide In Temple Bathroom | ఒక ఆలయంలోని బాత్రూమ్లో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు. వారిద్దరూ విషపూరిత మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
అహ్మదాబాద్: ఒక ఆలయంలోని బాత్రూమ్లో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు. వారిద్దరూ విషపూరిత మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Girls Sucide In Temple Bathroom) గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం ఇద్దరు యువతులు కాలేజీకి వెళ్లేందుకు తమ ఇళ్ల నుంచి స్కూటీలపై బయలుదేరారు. ఆ తర్వాత వారిద్దరూ తమ ఇళ్లకు చేరుకోలేదు.
కాగా, కాలేజీ అమ్మాయిల కుటుంబాల సమాచారంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఇద్దరు యువతుల మొబైల్ ఫోన్లు ట్రాక్ చేశారు. ప్రసిద్ధ స్వామినారాయణ్ ఆలయం వద్ద చివరిగా వారు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శనివారం అక్కడకు వెళ్లి పరిశీలించారు. గుడి ఆవరణలో పార్క్ చేసిన యవతుల స్కూటీలను గుర్తించారు.
మరోవైపు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. ఇద్దరు అమ్మాయిలు బాత్రూమ్కు వెళ్లినట్లు ఆ ఫుటేజ్‌లో గమనించారు. లోపల నుంచి లాక్ చేసి ఉన్న ఒక బాత్రూమ్ డోర్ పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా ఇద్దరు యువతులు మరణించి ఉన్నారు. వారి మృతదేహాల వద్ద ఉన్న సిరంజి, మూడు విషపూరిత డ్రగ్స్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ‘ఎలా ఆత్మహత్య చేసుకోవాలి’ అని మొబైల్లోని ఏఐ టూల్లో ఆ అమ్మాయిలు సెర్చ్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ యువతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
IRIS Lavan | ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడికి ముందు.. మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి
Watch: హోలీ నాడు రంగులు చల్లిన బాలుడు.. మనవడిపై వేడినీరు పోసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

