గాంధీనగర్: భారీ వర్షాలకు పార్కింగ్ ఏరియా జలమయమైంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్క్ చేసిన సుమారు 50కుపైగా కార్లు సగం వరకు నీట మునిగాయి. (Cars Submerged) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.
కాగా, గురువారం ఉదయం వరకు 16 గంటల్లో వల్సాద్‌లోని ఉంబర్‌గావ్ ప్రాంతంలో 1,100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు వల్సాద్‌లోని వాపిలో వాహనాల పార్కింగ్ స్థలం జలమయమైంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్క్ చేసిన సుమారు 50కు పైగా కార్లు నీటిలో చిక్కుకున్నాయి. కార్ల విండో వరకు వర్షం నీరు చేరడంతో పాక్షికంగా మునిగిపోయాయి. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Floods in Valsad, Gujarat. pic.twitter.com/vQCKTi350r
— Mumbai Rains (@rushikesh_agre_) July 23, 2026