భువనేశ్వర్: లోతైన బావిలో ఏనుగు పిల్ల పడింది. దీంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఆ ఏనుగు పిల్లను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Forest Officials Rescue Elephant) ఒడిశాలోని కెందుఝర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి వేళ బనజోడి గ్రామంలోని 30 అడుగుల లోతున్న బావిలో ఏనుగు పిల్ల పడింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఏనుగును బయటకు తీసేందుకు ఆర్కిమెడిస్ సూత్రాన్ని అమలు చేశారు. రెండు పైపుల ద్వారా ఆ బావిని నీటితో నింపారు.
మరోవైపు బావి అంచు వరకు నీరు చేరడంతో ఏనుగు పిల్ల పైకి తేలింది. ఆ తర్వాత జేసీబీతో ఆ ఏనుగును బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఏనుగు పిల్లను రక్షించిన అటవీ శాఖ అధికారులను పలువురు ప్రశంసించారు.
Archimedes principle (floating)won over Inclined plane (ramp) principle as ramp involved risk of wall collapse and despite floating involved risk of drowning in the midst of lethal fall in 30 feet deep well@IPR_Odisha @CMO_Odisha @PCCFWL_Odisha @pccfodisha @moefcc @wti_org_india… pic.twitter.com/CUf6Va1oh1
— Divisional Forest Officer, Keonjhar (T) (@DfoKeonjhar) March 6, 2026
Also Read:
Woman, Lover Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఆ తర్వాత అతడితో పెళ్లి
Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య
Man Kills Friend | మాజీ భార్యకు గిఫ్ట్ కొనేందుకు.. స్నేహితుడ్ని చంపి డబ్బు దొంగిలించిన వ్యక్తి