Road accident | టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. కారులోని నలుగురు దుర్మరణం..!
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టంగుటూరు టోల్గేట్ దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించేందుకు టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దాంతో కారు ముందున్న ప్రైవేట్ బస్సును ఢీకొన్నది. లారీకి, బస్సుకు నడుమ కారు నుజ్జుయ్యింది.
Road accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టంగుటూరు టోల్గేట్ దగ్గర ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. టోల్ ఫీజు చెల్లించేందుకు టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దాంతో కారు ముందున్న ప్రైవేట్ బస్సును ఢీకొన్నది. లారీకి, బస్సుకు నడుమ కారు నుజ్జుయ్యింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ పదిహేనేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
అద్దంకి మండలం బొమ్మనంపాడు, చెరుకుంపాలెం ప్రాంతాలకు చెందిన ఐదుగురు బెంగళూరు నుంచి కారులో స్వగ్రామాలకు బయలుదేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
ప్రమాదం తర్వాత మృతదేహాల మధ్య చిక్కుకున్న బాలుడు బోరున విలపిస్తూ కనిపించాడు. ఆ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. ఓటేసేందుకు స్వగ్రామానికి వస్తున్న కుటుంబసభ్యులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొన్నది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. కారులోని నలుగురు దుర్మరణం..!
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
HIT 4 | హిట్ 4పై కీలక అప్డేట్.. స్క్రిప్ట్ పూర్తి చేసిన శైలేష్ కొలను, కార్తీకి కథ ఎప్పుడు వినిపించనున్నారంటే?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

