Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది.
Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ దూసుకెళ్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించిన చిత్రబృందం, ఇప్పుడు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు సక్సెస్ టూర్ చేపట్టింది. ఈ క్రమంలోనే హీరో దుల్కర్ సల్మాన్, చిత్ర యూనిట్ నేడు (నవంబర్ 29) విశాఖపట్నంలో సందడి చేయనున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మీడియా సమావేశాలు, ఇన్ఫ్లుయెన్సర్లతో భేటీతో పాటు థియేటర్లను సందర్శించి ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ముందుగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం 3:15 గంటలకు ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత వరుసగా మూడు థియేటర్లను సందర్శించనున్నారు. వరుణ్ ఐనాక్స్, ఆర్కే బీచ్ రోడ్ – సాయంత్రం 5:20 గంటలకు, ఏఏఏ సినిమాస్, కైలాసపురం – సాయంత్రం 6:15 గంటలకు, శ్రీ లీలామహల్ థియేటర్, జగదాంబ జంక్షన్ – రాత్రి 7:30 గంటలకు.. ఈ థియేటర్ విజిట్స్‌లో దుల్కర్ సల్మాన్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులను కలుసుకోనున్నారు. దీంతో వైజాగ్‌లో ఆయన పర్యటనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ మధ్యతరగతి మెకానిక్ కృష్ణగా నటించగా, వ్యోమగామి కావాలనే కలలున్న కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి కనిపించింది. వీరిద్దరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ముఖ్యంగా సినిమా కథ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మౌత్ టాక్ బాగా పెరిగింది. తొలి వారంలో ఇండియాలో రూ.25.05 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం, తొమ్మిదో రోజు శనివారం ఒక్కరోజే రూ.4.50 కోట్ల నెట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51.63 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు ఆదివారం సెలవు రోజు కావడం కలిసొచ్చే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ వైజాగ్ పర్యటన సినిమాకు మరింత ప్రచారం తీసుకొస్తుందని, ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ లభిస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulquer Salmaan | వైజాగ్‌లో దుల్కర్ సల్మాన్ సందడి.. ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ టూర్ షెడ్యూల్ ఇదే!
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
KAAKA | వాయిదా వార్తలకు చెక్: జనవరి 13న ‘కాకా’ విధ్వంసం ఖాయం.. చిరంజీవి అధికారిక ప్రకటన!
HIT 4 | హిట్ 4పై కీలక అప్డేట్.. స్క్రిప్ట్ పూర్తి చేసిన శైలేష్ కొలను, కార్తీకి కథ ఎప్పుడు వినిపించనున్నారంటే?
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

