Guru Purnima | ఓంకారాశ్రమంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
Guru Purnima | ఊట్కూర్ (కృష్ణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరు టైరోడ్డు సమీపంలోని కృష్ణానది తీరం ఉన్న శ్రీ ఓంకారాశ్రమంలో బుధవారం గురు పౌర్ణమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు .
ఊట్కూర్ (కృష్ణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరు టైరోడ్డు సమీపంలోని కృష్ణానది తీరం ఉన్న శ్రీ ఓంకారాశ్రమం ( Omkarashram ) లో బుధవారం గురు పౌర్ణమి ( Guru Purnima ) మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఓంకారానందగిరి గురువును దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా గురుపూజ, పాదసేవ, ధ్యానం, భగవద్గీత పారాయణం, భజనలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గురువు శిష్యురాలు శివ చైతన్యానంద రచించిన భక్తి గీతాల సీడీని ఆవిష్కరించారు. అదేవిధంగా శ్రీ ఓంకారాశ్రమం అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు.
ఓంకారానంద స్వామి మాట్లాడుతూ గురువు చూపే మార్గమే మనిషిని అజ్ఞానాంధకారం నుంచి జ్ఞాన వెలుగులోకి నడిపిస్తుందని అన్నారు. గురువు బోధలను ఆచరణలో పెట్టినవారే నిజమైన శిష్యులని పేర్కొన్నారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఎల్కోటి నారాయణరెడ్డి, విఠోబా, శివన్న గౌడ్, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

