Jason Sanjay | నా మొదటి సినిమా కోసం నాన్న వెయిటింగ్ : సీఎం విజయ్ కొడుకు జేసన్
Jason Sanjay | కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Jason Sanjay | కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వేదికగా జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం గురించి, సినిమాలపై ఉన్న ఆసక్తిని పంచుకున్నారు. తాను కాలేజీలో స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్‌పై ప్రత్యేకంగా కోర్సు పూర్తి చేసినట్లు తెలిపారు. సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకున్నానని, ఈ జర్నీలో తన కుటుంబం, ముఖ్యంగా తన తండ్రి విజయ్ అందించిన సపోర్ట్ మరువలేనిదని పేర్కొన్నారు. ‘మైఖేల్’ చిత్రంలో సందీప్ కిషన్ నటన నచ్చి ఈ ప్రాజెక్ట్ కోసం ఆయనను ఎంపిక చేసినట్లు జేసన్ వివరించారు. తాను తెరకెక్కించిన ఈ తొలి సినిమాను థియేటర్లలో చూసేందుకు తన తండ్రి విజయ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించారు. ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ.. ‘సిగ్మా’ తన మొదటి తమిళ చిత్రమైనప్పటికీ, ఈ సినిమా కోసం తాను స్వయంగా డబ్బింగ్ చెప్పానని తెలిపారు. ఈ సినిమా అందరినీ కచ్చితంగా అలరిస్తుందని హీరో సందీప్ కిషన్ ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

