Viral news : సముద్ర జీవుల్లో అత్యంత తెలివైనవిగా పేరున్న కిల్లర్ వేల్స్ (Killer Whales (ఓర్కాలు)) కు సంబంధించిన ఓ అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. మెక్సికో (Mexico) లోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా (Gulf of California) లో ఓ భారీ ఓషన్ సన్‌ఫిష్‌ను ఒక ఓర్కా అత్యంత వేగంగా ఢీకొట్టి వేల ముక్కలుగా పేల్చివేసింది. ఈ అసాధారణ వేట పద్ధతిని సముద్ర జీవశాస్త్రవేత్తలు తొలిసారిగా వీడియోలో బంధించారు. ‘బినీత్ ది వేవ్స్’ అనే సంస్థకు చెందిన మెరైన్ బయాలజిస్ట్ (Marine Biologist) డాక్టర్ క్యాథరిన్ ఐర్స్ (Dr.Catherine Ires) ఈ అరుదైన ఫుటేజ్‌ను రికార్డ్ చేశారు.
ఇందులో ఒక ఆడ ఓర్కా చనిపోయిన సన్‌ఫిష్ తోకను పట్టుకుని ఉండగా, మరో మగ ఓర్కా దానివైపు అత్యంత వేగంగా దూసుకువచ్చింది. ఢీకొట్టడానికి కొద్ది క్షణాల ముందు ఆడ ఓర్కా సన్ ఫిష్‌ను వదిలేయగా.. మగ ఓర్కా దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ భారీ చేప వేల ముక్కలుగా చిన్నాభిన్నమైంది. అనంతరం ఆ ముక్కలను ఓర్కా గుంపులోని చేపలన్నీ సులభంగా పంచుకు తిన్నాయి. ఓ చిన్న ఓర్కా కూడా ఈ ముక్కలను తినడం కనిపించింది. ఓషన్ సన్‌ఫిష్ (మోలా మోలా) దాదాపు 2000 కిలోల బరువు వరకు పెరుగుతుంది.
ఇంత పెద్ద చేపను ముక్కలు చేయడం కష్టం కాబట్టి.. ఓర్కాలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2025 సెప్టెంబర్‌లో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి సంఘటనే రికార్డయింది. ఈ వరుస ఘటనలు ఓర్కాల సమస్య పరిష్కార సామర్థ్యాలను, సామాజిక సమన్వయంతో వేటాడే నైపుణ్యాలను తెలియజేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
🔥🚨LATEST: marine biologist Dr Kathryn Ayres, a scientist at Beneath The Waves, in the Gulf of California, captured chaotic and beautiful footage of a female orca smashing into a 4,000 pound fish so hard that it exploded in a behavior that has never been captured on camera. pic.twitter.com/UibZduq1AO
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) July 23, 2026