Cop reunites wife with lover | ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య.. వారిద్దరికి పెళ్లి చేసిన భర్త
Cop reunites wife with lover | పెళ్లైన యువతి తన క్లాస్మేట్ అయిన ప్రియుడితో కలిసి పారిపోయింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆ జంటను వెతికి తీసుకువచ్చారు. అయితే ప్రియుడితోనే కలిసి ఉంటానని ఆ యువతి చెప్పింది. ఈ నేపథ్యంలో భర్త తన భార్య ప్రియుడితో ఆమెకు పెళ్లి చేశాడు.
లక్నో: పెళ్లైన యువతి తన క్లాస్మేట్ అయిన ప్రియుడితో కలిసి పారిపోయింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆ జంటను వెతికి తీసుకువచ్చారు. అయితే ప్రియుడితోనే కలిసి ఉంటానని ఆ యువతి చెప్పింది. ఈ నేపథ్యంలో భర్త తన భార్య ప్రియుడితో ఆమెకు పెళ్లి చేశాడు. (Cop reunites wife with lover) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ప్రాంతీయ రక్షక్ దళ్ (పీఆర్డీ) జవాన్ అయిన విక్కీకి ఏడాది కిందట సొనాలి అనే యువతితో పెళ్లి జరిగింది. అయితే వివాహం తర్వాత కూడా మలిహాబాద్ ప్రాంతంలో కలిసి చదువుకున్న చిన్ననాటి ప్రియుడితో తన సంబంధాన్ని ఆమె కొనసాగించింది. వారిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న సొనాలి తన అత్తవారింటి నుంచి నుంచి వెళ్లిపోయింది. ప్రియుడితో కలిసి పారిపోయింది.
కాగా, సొనాలి అదృశ్యం కావడంతో ఆమె భర్త, అత్తింటివారు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె కోసం వెతికారు. చివరకు ప్రియుడితో కలిసి హర్దోయ్‌లో ఆమె ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 9న ఆ జంటను లక్నోకు పోలీసులు తీసుకువచ్చారు.
మరోవైపు భర్త వద్దకు తిరిగి వెళ్లేలా సొనాలిని ఒప్పించేందుకు ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే ప్రియుడితోనే కలిసి జీవిస్తానని, భర్తతో కలిసి ఉండలేనని ఆమె తెగేసి చెప్పింది. దీంతో జవాన్ అయిన భర్త విక్కీ భార్య పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలతో చర్చల తర్వాత ఒక గుడిలో ప్రియుడితో ఆమె పెళ్లి జరిపించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
लखनऊ में तैनात पीआरडी के एक जवान ने पत्नी की इच्छा का पूरा सम्मान किया। उसने एक वर्ष पहले हुए विवाह को कुरबान कर दिया। उसने गुरुवार कोअपनी पत्नी का विवाह उसके प्रेमी से
पत्नी प्रेमी के साथ चली गई काफी खोजबीन के बाद पुलिस ने उन दोनों को बरामद कर लिया लेकिन घरवालों के समझाने के pic.twitter.com/nB6F4KDApM— 🇮🇳⚔️शौर्य सेना ⚔️🇮🇳 (@ShauryaSena1) September 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cop Husband
- Lover
- Married
- Ran away
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

