Konda Murali | కాంగ్రెస్‌ను వీడేది లేదు.. నా పదవి తీసే ధైర్యం ఎవరికీ లేదు : కొండా మురళి
Konda Murali | తన పదవిని తీసేసే ధైర్యం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కొండా సురేఖ భర్త కొండా మురళి అన్నారు. నమ్మిన వాళ్ళకు న్యాయమే చేశానని ఆయన చెప్పారు. సురేఖ గెలుపునకు రాహుల్‌గాంధీ కృషిచేశారని అన్నారు. ప్రధానిని చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు.
Konda Murali : తన పదవిని తీసేసే ధైర్యం ఎవరికీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కొండా సురేఖ భర్త కొండా మురళి అన్నారు. నమ్మిన వాళ్ళకు న్యాయమే చేశానని ఆయన చెప్పారు. సురేఖ గెలుపునకు రాహుల్‌గాంధీ కృషిచేశారని అన్నారు. ప్రధానిని చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలే ముఖ్యమని అన్నారు. కృతజ్ఞత తమ రక్తంలో, కుటుంబంలో ఉన్నదని తెలిపారు.
ముస్లింలతో తమకు మంచి అనుబంధం ఉన్నదని కొండా మురళి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చాడని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యమని అన్నారు. ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదం వల్లే ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. ఉదయం ఒకవైపు, సాయంత్రం ఒకవైపు కాకుండా ఒక్కవైపే ఉండండని సూచించారు.
తమ ఇద్దరిదీ ఒకే మాట అని, తమ బిడ్డది మరొక మాట అని కొండా మురళి చెప్పారు. ఆమె ఏం చేస్తుందో తమకు తెలియదని అన్నారు. తాను బెదిరించి కబ్జా చేసినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. తమ బిడ్డ మాటలకు తమకు సంబంధం లేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి తనపై బాగా నమ్మకం ఉంచిండని, రాజశేఖర్ రెడ్డి లేని కేబినెట్లో తాము ఉండలేక పోయామని చెప్పారు. కార్యకర్తల కోసమే పార్టీలో ఉంటామని అన్నారు.
హరీష్ రావు, తాను అన్ని కులాలను కలుపుకొని పోతామని కొండా మురళి చెప్పారు. కార్యకర్తల కోసం తాను ఏమైనా చేస్తానని, వారే తన బలం, బలగం, దైర్యమని అన్నారు. తాము ఈ విధానానికే కట్టుబడి ఉంటామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

