పల్నాడు వాటర్‌గ్రిడ్ అనైతికం.. ప్రాజెక్టుకు కేఆర్ఎంబీ అనుమతి లేదు
ఏపీ ప్రభుత్వం ఎ లాంటి అనుమతులు తీసుకోకుండా, తెలంగాణకు సమాచారం ఇవ్వకుండా పల్నాడు వాటర్‌గ్రిడ్ ప నులు చేపట్టడం అనైతికమని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తే సహించం: తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు
హాలియా, నవంబర్ 20 : ఏపీ ప్రభుత్వం ఎ లాంటి అనుమతులు తీసుకోకుండా, తెలంగాణకు సమాచారం ఇవ్వకుండా పల్నాడు వాటర్‌గ్రిడ్ ప నులు చేపట్టడం అనైతికమని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. నెల్లికల్లు లిప్ట్ మొదలు నాగార్జునసాగర్ రైట్‌బ్యాంక్ వరకు, విజయపురి సౌత్‌లో ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద వరకు వెళ్లి పరిశీలించారు. అనంతరం విజయవిహార్‌లో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ర్టాలకు చెందిన నాగార్జునసాగర్‌పై తెలంగాణ, ఏపీకి సమాన హక్కులున్నాయని తెలిపారు. కేఆర్ఎంబీ నిర్ణయం మేరకు ఇరు రాష్ర్టా లు తమకు కేటాయించిన నీటిని వాడుకొనే హక్కు కలిగి ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుపై కొత్తగా ఏ సా గు, తాగునీటి ప్రాజెక్టును చేపట్టినా ముందుగా కేఆర్ఎంబీకి చెప్పడంతోపాటు ఇరు రాష్ర్టాలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నదని స్పష్టంచేశారు.
చెప్పకుండానే పల్నాడు పనులు
ఏపీ ప్రభుత్వం రూ.1,200 కోట్లతో చేపట్టిన ప ల్నాడు ప్రాజెక్టు పనులు ఏడాది కాలంగా కొనసాగుతున్నా.. ఇటు కేఆర్ఎంబీకి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ సమాచారం ఇవ్వకం పోవడం బాధాకరమన్నారు. సాగర్ ప్రాజెక్టు రక్షణ, నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది కాగా, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, రక్షణ బాధ్యత ఏపీకి ఉన్నదని తెలిపారు. ఏడాది కాలంగా పనులు చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం దృష్టికి రాకపోవడం, గుర్తించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు తా ము వ్యతిరేకం కాదని , అయితే ముందుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఏపీపై ఉన్నదన్నారు. ప్రజల ప్రయోజనాలు, హక్కుల రక్షణలో రాజీపడబోమని తేల్చిచెప్పారు.
డేడ్ స్టోరేజీలో ఉన్నా..
సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, కనిష్ట నీటిమట్టం 510 అడుగులు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టుకు మాత్రం సాగర్ జలాశయంలో 490 అ డుగుల నీరు ఉన్నప్పుడు కూడా నీటిని తరలించేలా వాటర్‌గ్రిడ్‌ను డిజైన్ చేసినట్టు చెప్పారు. ఇందుకోసం విజయపురి సౌత్ వద్ద నాగార్జునసాగర్ జలాశయానికి పక్కనే నాలుగు నీటి సంప్లతోపాటు ఒక ఇంటేక్వెల్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. 5 డయా విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇంటేక్‌వెల్‌కు 490 అడుగుల వద్ద ఒక్కటి, 530 అడుగులు వద్ద ఒకటి, 560 అడుగుల వద్ద ఒకటి పెట్టినట్టు తెలిసిందన్నారు.
విభజన చట్టానికి విరుద్ధం : తన్నీరు వెంకటేశం
ఏదైనా కొత్తప్రాజెక్టు చేపట్టినప్పుడు విభజన చ ట్టంలోని నిబంధనలు పాటించాలని సంఘం ప్ర ధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం స్పష్టంచేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, సెక్షన్-84 అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు, సెక్షన్-85 కృష్ణా బోర్డు ఏర్పాటు, 86లో కృష్ణా బోర్డు విధివిధానాలు నిర్ణయించినట్టు తెలిపారు. దీన్ని రెండు రా ష్ర్టాల వారు గుర్తించాలన్నారు. ఏపీ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టు మంచినీటి కోసమే పల్నాడు ప్రాజెక్టు చేపట్టినా సెక్షన్-84ను పాటించలేదన్నారు. ఏపీ పంచాయతీరాజ్‌శాఖ 2022లో పల్నాడు గ్రిడ్‌గా జీవో విడుదల చేస్తే, దాన్ని 2024లో అమరజీవి వాటర్‌గ్రిడ్‌గా పేరు పెట్టి పక్క ప్రభుత్వానికి చెప్పకపోవడం బాధాకరమన్నారు. ప్రాజెక్టు ద్వారా రోజు కు 1.86 టీఎంసీల నీరు తరలిస్తారన్న వార్తలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు తాము ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. సమావేశంలో తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల సంఘం ఉపాధ్యక్షుడు తన్నీరు వెంకటేశం, సంఘ గౌరవ అధ్యక్షులు గోలి దామోదర్‌రెడ్డి, చీఫ్ ప్యాటర్న్ చంద్రమౌళి, ప్యాటన్ సత్తిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ కుట్రలో కేంద్రం భాగస్వామ్యం : దేశ్‌పాండే
ప్రాజెక్టు నిర్మిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టడం, తెలంగాణ ప్రభుత్వం సోయి లేకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ‘ఏపీ ప్రభు త్వం ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపా డు ద్వారా వందలాది టీఎంసీలు తరలించుకుపోతున్నది. గోదావరి బేసిన్ నుంచి కూడా పోలవరం, న ల్లమలసాగర్ ద్వారా 200 టీఎంసీలను అక్రమంగా తరలించడానికి కుట్రలు చేస్తున్నది. ఉమ్మడి జలాశయం సాగర్ నుంచి ఏపీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక ప్రాజెక్టును చేపట్టడం దారుణం. ఇప్పుడు కండ్లు తెరిచి, ఫిర్యాదు చేయడం ఊరట. డీపీఆర్ తయారు చేసి కేఆర్ఎంబీకి ఇవ్వకుండానే కేంద్రం నిధులు సమకూర్చుతుండటం విచిత్రం. ఏపీ కుట్రలో కేంద్రం భాగస్వామి కావడం బాధాకరం’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

