Sharmila Dhankar : కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్‌లో దేశానికి మొట్టమొదటి స్వర్ణం అందించింది షర్మిలా ధన్కర్ (Sharmila Dhankar). మహిళల పారా షాట్‌పుట్ విభాగంలో సత్తా చాటిన షర్మిల గోల్డ్ మెడల్‌తో చరిత్ర సృష్టించింది. రెండేళ్ల వయసులోనే పోలియోకు గురైన ఆమె.. అడుగడుగునా కష్టాలు,భర్త చేతిలో గృహహింసను చవిచూసింది. కష్టాల సుడిగుండాలను దాటి గ్లాస్గోలో పసిడి వెలుగులు విరజిమ్మింది. 40 ఏళ్ల వయసులో దేశం గర్వపడే విజయంతో వైరలవుతున్న షర్మిల ప్రస్థానమిది.
కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్లు వరసగా పతకాలతో అదరగొడుతున్నారు. వారికి మేము ఏమీ తక్కువ కాదని చాటుతూ పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ పసిడితో మెరిసింది. సోమవారం జరిగిన షాట్‌పుట్ ఫైనల్లో ఇనుపగుండును ఏకంగా9.81 మీటర్ల దూరం విసిరిన ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఈవెంట్లో మొట్టమొదటి స్వర్ణంతో వార్తల్లో నిలిచిన పారా అథ్లెట్‌గా చరిత్రకెక్కిన షర్మిల జీవితంలో కన్నీళ్లు, కష్టాలు ఎన్నో.
Breaking barriers. Making history. 🤩
A golden first for Indian Para Athletics.🥇
Sharmila Dhankar creates history, becoming India’s first-ever Commonwealth Games gold medallist in Para Athletics with a throw of 9.81m. ✨
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE &… pic.twitter.com/32yp6fXm48
— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026
అసలే పోలియోతో సతమతమవుతున్న ఆమెను వైవాహిక జీవితంలో చేదు అనుభవాలను మరింత కుంగదీశాయి. అయినా జీవితంపై ఆశకోల్పోని షర్మిలా తన ఇద్దరు పిల్లల కోసం బతకాలనుకుంది. ఆత్మవిశ్వాసం కూడదీసుకొని.. పారా అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టింది. కామన్వెల్త్లో స్వర్ణంతో తన కలను సాకారం చేసుకున్న షర్మిల జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనవ్వకూడదని చాటుతోంది.
హర్యానాలోని రేవారీకి చెందిన పేద కుటుంబంలో జన్మించిన షర్మిల రెండేళ్లకే పోలియో బారిన పడింది. ఆమె తల్లి అంధురాలు, తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 19 ఏళ్లకే బలవంతంగా కన్నవారు ఆమెకు పెళ్లి చేశారు. అయితే.. భర్త ఆమెను తరచూ కొట్టేవాడు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతడి ప్రవర్తన మారలేదు. ఓ రోజు రాత్రి అతడు పశువులా మరాడు. 11 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకూ ఆమె తీవ్రంగా కొట్టాడు. అలాంటి శాడిస్టు మొగుడితో బతకడం తనవల్ల కాదనే నిర్ణయానికి వచ్చిన షర్మిల అదే రోజు.. తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.
MEET 40 YO SHARMILA DHANKAR 🇮🇳
Shr was born into poverty. Her mother was blind, her father was a farmer, and she contracted polio at the age of two.
At just 19, Sharmila was trapped in an abusive marriage. One night, she was beaten from 11 PM to 3 AM and thrown out of her home… pic.twitter.com/DKVj1Gfs3v
— The Khel India (@TheKhelIndia) July 28, 2026
ఇద్దరు కూతుళ్లను పోషించేందుకు ఏదైనా చేయాలుకున్న ఆమె.. 34 ఏళ్ల వయసులో పారా అథ్లెటిక్స్‌పై దృష్టి సారించింది. తనలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆమె షాట్‌పుట్‌ను ఎంచుకుంది. దాంతో, జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్న కూతురికి తల్లిదండ్రలు అండగా నిలిచారు. ఆమె శిక్షణ ఖర్చు కోసం ఏకంగా ఇంటిని కూడా అమ్మేసి డబ్బలు సర్దారు. కన్నవారి కష్టాన్ని, పిల్లలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని షర్మిల నిలబెట్టుకుంది. 40 ఏళ్లలో స్వర్ణమే లక్ష్యంగా గ్లాస్గో వెళ్లిన ఆమె.. అనుకున్నట్టే 9.81 మీటర్ల దూరం ఇనుపగుండును విసిరి గోల్డ్‌మెడల్‌తో దేశాన్ని, తన కన్నవారిని, కుటుంబాన్ని సంబురాల్లో ముంచెత్తింది.