Avengers: Doomsday Trailer | విలన్‌గా మారిపోయిన ఐరన్ మ్యాన్.. యాక్షన్ ప్యాక్డ్గా ‘అవెంజర్స్ డూమ్స్‌డే’ ట్రైలర్!
Avengers Doomsday | మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంచలన చిత్రం 'అవెంజర్స్: డూమ్స్ డే' ట్రైలర్ ప్రస్తుతం ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Avengers: Doomsday Trailer | మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్ ప్రస్తుతం ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఐరన్ మ్యాన్‌గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న హాలీవుడ్ స్టార్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ (RDJ) ఈసారి అత్యంత శక్తివంతమైన విలన్‌గా ‘డాక్టర్ డూమ్’ పాత్రలో ఎంట్రీ ఇవ్వడం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
విడుదలైన ఈ ట్రైలర్లో రాబర్ట్ డౌనీ జూనియర్ గ్రీన్ హుడ్, మెటల్ మాస్క్‌తో సరికొత్త భయంకరమైన లుక్‌లో కనిపిస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ట్రైలర్ ఆరంభంలోనే గాడ్ ఆఫ్ థండర్ (థోర్) తో డాక్టర్ డూమ్‌కు మధ్య జరిగే భీకర పోరులో, థోర్ని సైతం మోకాళ్ల మీద కూర్చోబెట్టేలా డూమ్ చూపించిన ఆధిపత్యం సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. కేవలం అవెంజర్స్ మాత్రమే కాకుండా ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్-మెన్ వంటి ప్రముఖ సూపర్ హీరో బృందాలన్నీ ఏకమై ఈ ముప్పును ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

