Man cuts off mother-in-law’s nose | అత్త ముక్కు కోసిన అల్లుడు.. తెగిన ముక్కు భాగంతో పరార్
Man cuts off mother-in-law’s nose | కుటుంబ గొడవల వల్ల అత్తపై అల్లుడు దాడి చేశాడు. కత్తెరతో ఆమె ముక్కు కత్తిరించాడు. తెగిన ముక్కు భాగాన్ని పట్టుకుని పారిపోయాడు. ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మామ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జైపూర్: కుటుంబ గొడవల వల్ల అత్తపై అల్లుడు దాడి చేశాడు. కత్తెరతో ఆమె ముక్కు కత్తిరించాడు. తెగిన ముక్కు భాగాన్ని పట్టుకుని పారిపోయాడు. (Man cuts off mother-in-law’s nose) ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మామ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భీమ్గుడా గ్రామానికి చెందిన సోహన్లాల్కు దూంగ్రి గ్రామానికి చెందిన సరితతో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాదిగా ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సరిత తన భర్తను వీడి పుట్టింట్లో నివసిస్తున్నది. వైవాహిక వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, మార్చి 7న మధ్యాహ్నం వేళ అత్తవారింటికి సోహన్‌లాల్ చేరుకున్నాడు. అక్కడ వారితో గొడవపడ్డాడు. తన భార్యను విడదీసేందుకు అత్త ఉసుగొల్పుతున్నదని ఆరోపించాడు. గొడవ పెరుగడంతో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో అల్లుడిపై ఫిర్యాదు చేసేందుకు అత్త అయిన 52 ఏళ్ల కైలీ దేవి, సర్వానా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరింది.
మరోవైపు అల్లుడు సోహన్‌లాల్ అత్తను అడ్డుకున్నాడు. కత్తెరతో ఆమె ముక్కు కోశాడు. తెగిన ముక్కు భాగాన్ని చేతపట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన కైలీ దేవిని తొలుత సర్వానాలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గుజరాత్‌లోని మెహ్సానా ఆసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు.
అయితే మామ బాబులాల్ కిచాడ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సోహన్‌లాల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Cracks on Gujarat bridge | గుజరాత్లో వంతెనకు పగుళ్లు.. వాహనదారులు, స్థానికులు ఆందోళన
Illegal Opium Cultivation | ఫార్మ్‌హౌస్‌లో నల్లమందు సాగు.. బీజేపీ నేత సస్పెండ్
Old Woman Gang Raped | 90 ఏళ్ల వృద్ధురాలిపై.. ముసుగులు ధరించిన నలుగురు సామూహిక అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cuts Off
- Flees With
- Jalore
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

