Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
Panchayat Elections | ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లో గురువారం జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 7 నుంచి ప్రారంభమైన పోలింగ్ (Polling ) మధ్యాహ్నం 1 గంటల వరకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. 26 జిల్లాల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవాలు మినహా మిగతా 3,240 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తరువాత ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు మినహా పోలీంగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దంపతులు ఉండవల్లిలోని ఎంపీయూపీ స్కూల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఓటు వేశారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్మలదిన్నెలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగ ఓట్లు వేస్తున్నారని సమచారం మేరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా ఆమె కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు కూడా గురువారం పోలింగ్ జరిగింది రాజమహేంద్రవరం , మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లకు నాలుగు మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకుగాను 11.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. 19 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు చైర్పర్సన్ కోసం 134 మంది పోటీ పడుతుండగా 707 కౌన్సిలర్ స్థానాల కోసం 2,057 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు వెల్లడించారు. ఈనెల 30న ఎన్నికల ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమ్మకానికి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి?
Netflix | పాకిస్థాన్ కంటెంట్‌ను బ్లాక్ చేయండి.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

