High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి(Cyberabad CP Ramesh Reddy), మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి(Medchal DCP Koti Reddy) జైలు శిక్ష(Jail sentence) విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి(Cyberabad CP Ramesh Reddy), మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి(Medchal DCP Koti Reddy) జైలు శిక్ష(Jail sentence) విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు ఉన్నత న్యాయ స్థానం రెండు వారాల జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలంటూ గతంలో ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ శిక్షను విధించింది.
కాగా, వారు జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈ శిక్ష అమలును హైకోర్టు వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది (సస్పెండ్ చేసింది). వారం రోజుల్లోపు ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురాకపోతే, హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
Vijay Sethupathi | ‘ఖైదీ’ కథ మొదట నా దగ్గరకే వచ్చింది: విజయ్ సేతుపతి
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

