Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
Nagarkurnool women | సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు ఏం చేయకపోగా.. ఉన్న భూములను సైతం లాక్కుంటున్నారని నాగర్ కర్నూల్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nagarkurnool women | నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభకు మహిళలను తరలించేందుకు ఆర్టీసీ బస్సుతో వచ్చిన మహిళా సంఘాల నాయకురాళ్లు, కాంగ్రెస్ మహిళలకు నిరసన సెగ తగిలింది. తెలకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ పని తీరుపై నాగర్ కర్నూల్ మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు ఏం చేయకపోగా.. ఉన్న భూములను సైతం లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా సంఘాల నాయకురాళ్లతో మహిళలు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినంక అసలు ఎవరికేం సాయం చేసిండని ప్రశ్నించారు.. మాకేం సాయం చేయలేదు.. మా తాత ముత్తాతల నుంచి ఉన్న మా భూములను వాళ్లిచ్చారు.. వీళ్లిచ్చారని దొంగ సంతకాలు చేసుకుని గుంజుకుంటున్నాడని ఫైర్ అయ్యారు.
మహిళలకు రూ.2500 ఇస్తాయని ఇయ్యలేదు.. గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తమన్నడు కానీ లేదు.. రేవంత్ రెడ్డి వచ్చినంక మాకు ఏం పనులు కాలేదు.. ఇప్పుడు మా భూముల మీద దాడి చేస్తున్నడు.. పోలీసోళ్లు వచ్చి మమ్మల్ని గుంజేస్తున్నరు.. అరెస్ట్ చేస్తున్నరు.. మమ్మల్ని ఫొటోలు తీసుకొని పోలీస్ స్టేషన్‌కు పోయారు.. రేవంత్ రెడ్డి ప్రజాసేవ చేసిండంటే.. ఎవరి కోసం చేసిండు.. జీతం తీసుకోకుండానే చేసిండా..? మా భూములు మాకివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటమని హెచ్చరించారు.
నాగర్‌కర్నూల్ సీఎం రేవంత్ సభకు వచ్చేందుకు నిరాకరించిన మహిళలు
మహిళలను తరలించేందుకు ఆర్టీసీ బస్సుతో వచ్చిన మహిళా సంఘాల నాయకురాళ్లకు నిరసన సెగ
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళల నిరసన
అచ్చంపేటలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు మహిళలను తరలించేందుకు ఆర్టీసీ బస్సుతో వచ్చిన మహిళా సంఘాల నాయకురాళ్లు, కాంగ్రెస్ మహిళలు
ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు చేసిందేమిటని నిలదీత
ఉన్న భూములను సైతం లాక్కుంటున్నారని ఆగ్రహం
రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపణ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తాము బాగున్నామని.. సీఎం రేవంత్ సభకు తాము వచ్చేది లేదని మహిళా సంఘాల నాయకురాళ్లకు స్పష్టం
సభకు వెళ్లేందుకు నిరాకరించి, మహిళా నాయకురాళ్లను వెనక్కి పంపించిన మహిళలు
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2026
Read Also :
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarkurnool women | రేవంత్ రెడ్డి మాకేం సాయం చేయలేదు.. నాగర్ కర్నూల్ మహిళల ఫైర్.. వీడియో
Vijay Sethupathi | ‘ఖైదీ’ కథ మొదట నా దగ్గరకే వచ్చింది: విజయ్ సేతుపతి
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

