Vijay Sethupathi | ‘ఖైదీ’ కథ మొదట నా దగ్గరకే వచ్చింది: విజయ్ సేతుపతి
Kaithi | కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన కెరీర్లో వదులుకున్న ఓ బ్లాక్‌బస్టర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తన కెరీర్లో వదులుకున్న ఓ బ్లాక్‌బస్టర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి హీరోగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘ఖైదీ’ (Kaithi) సినిమా కథ మొదట తన వద్దకే వచ్చిందని విజయ్ సేతుపతి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు కూడా జరిగాయని, అయితే కొన్ని కారణాల వల్ల అది చివరికి ఖరారు కాలేదని తెలిపారు.
ఆ సమయంలో హీరో కార్తి స్వయంగా తనకు ఫోన్ చేసిన విషయాన్ని విజయ్ సేతుపతి గుర్తుచేసుకున్నారు. “కార్తి నాకు ఫోన్ చేసి, ‘యోవ్ వీఎస్, నేను ఈ సినిమా చేస్తానయ్యా’ అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. అందుకు నేను కూడా అంతే సంతోషంతో ‘చాలా బాగా చేయండి సర్’ అని చెప్పాను” అంటూ ఆనాటి సంభాషణను వివరించారు. ఆ సినిమా తన చేజారిపోయినందుకు తనకు ఎలాంటి బాధ గానీ, విచారం గానీ లేదని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఎంతో కాలంగా తెలుసని, అతను తనకు సొంత సోదరుడి లాంటివాడని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. అలాగే హీరో కార్తి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.
‘ఖైదీ’ కథ విన్నప్పుడే అది కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని తనకు అర్థమైందని, తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం అద్భుతంగా ఆడుతుందని తాను ముందే చిత్రబృందంతో చెప్పానని తెలిపారు. అది ఒక అద్భుతమైన, మంచి సినిమా అని కొనియాడుతూ, అలాంటి మరో మంచి సినిమాను తాను కోల్పోయానని ఎప్పుడూ భావించలేదని విజయ్ సేతుపతి తన హుందాతనాన్ని చాటుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | ‘ఖైదీ’ కథ మొదట నా దగ్గరకే వచ్చింది: విజయ్ సేతుపతి
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

