Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Dasoju Shravan kumar | రాజ్యాంగం నిప్పులాంటిది.. ఇలాంటి నిప్పుతో చెలాగాటమాడుతున్న ఇటువంటి దుర్మార్గులకు తగిన గుణపాఠం చెప్పాలంటే రాజ్యాంగ స్పూర్తిని అన్వయించుకోవాలన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్.
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన హక్కు ఓటు హక్కు.. ఆ ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి పునాది అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఓటు హక్కును ఇవాళ నోట్ల ద్వారా కొనుక్కొనే, అమ్ముకునే దుర్మార్గమైన వ్యవస్థను చూస్తున్నాం.. ఓటుకు నోటు దొంగలు ఇవాళ ముఖ్యమంత్రులుగా చెలామణి అవుతూ.. వాళ్ల చేతుల్లోనే ఇయ్యాళ్ల జై సంవిధాన్ అని రాజకీయ డ్రామాలాడుతున్న విషయాన్ని చూస్తున్నాం.. రాజ్యాంగం నిప్పులాంటిది.. ఇలాంటి నిప్పుతో చెలాగాటమాడుతున్న ఇటువంటి దుర్మార్గులకు తగిన గుణపాఠం చెప్పాలంటే రాజ్యాంగ స్పూర్తిని అన్వయించుకోవాలన్నారు.
మనకు రాజ్యాంగ అక్షరాస్యత ఎంతో అవసరముంది. రాజ్యంగ అక్షరాస్యత కోసం భవిష్యత్‌లో మన పని చేయాల్సి ఉంటుందని దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ పెద్ద పెద్ద ఎన్నికల్లో కూడా చాలా మంది చదువుకునే వాళ్లు కూడా ఓటును అమ్ముకునే వాళ్లున్నరు.. ఓటును కొనుక్కునేవాళ్లున్నారు.. అంటే రాజ్యాంగాన్ని మనం హననం చేసుకున్నట్టే రాజ్యాంగానికి ద్రోహం చేసుకున్నట్టే.. ఈ సందర్భంగా నేను భారత రాష్ట్ర సమితి తరపున హృదయ పూర్వకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇది చదవండి.. అన్వయించండి.. ఇది ప్రశ్నించే హక్కునిస్తుంది.. దాంతోపాటు మనకున్న బాధ్యతలను గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా .. ఒక మంచి సమాజాన్ని భవిష్యత్ తరాలకు మనం అందించాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.. రక్షించాలని పిలుపునిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పిస్తున్నాం.. జై సంవిధాన్ అంటూ నినదించారు.
LIVE: జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు https://t.co/2NPzt95h7j
— BRS Party (@BRSparty) November 26, 2026
Read Also :
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Salman Khan | వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్.. షూటింగ్‌లోనే కోటి రూపాయల వాచ్ బహుమతిగా ఇచ్చాడా?
Suryapet | ప్రేమించలేదని దారుణం.. చెప్పుతో విద్యార్థినిపై దాడి..!
Nithiin | క్రేజీ కాంబినేషన్.. మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు రామ్ అబ్బరాజుతో నితిన్ కొత్త సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

