Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Netflix India | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) జీవితం, అతను చేసిన వందల కోట్ల రూపాయల ఆర్థిక మోసాల ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక కొత్త ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) జీవితం, అతను చేసిన వందల కోట్ల రూపాయల ఆర్థిక మోసాల ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక కొత్త ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీని ప్రకటించింది. ‘లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ’ (Love, Scam Aur Dhokha: The Sukesh Chandrashekhar Story) పేరుతో రూపొందుతున్న ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ డాక్యుమెంటరీకి మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహించారు. బెంగళూరులో సాధారణ స్థాయి నుంచి మొదలైన సుకేశ్ ప్రస్థానం, దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను సైతం బురిడీ కొట్టించే స్థాయికి ఎలా చేరిందో ఇందులో చూపించనున్నారు. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలతో అతనికి ఉన్న సంబంధాలు, విలాసవంతమైన బహుమతుల వెనుక ఉన్న అసలు కథను ఈ సిరీస్ ఆవిష్కరించనుంది.
రెండేళ్లకు పైగా సాగిన లోతైన పరిశోధన ఆధారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కేవలం వార్తల్లో కనిపించిన అంశాలకే పరిమితం కాకుండా, తీహార్ జైలులో ఉంటూనే సుకేశ్ తన మోసాల నెట్‌వర్క్‌ను ఎలా నడిపించాడో, వ్యవస్థలోని ఏ లోపాలు అతనికి అనుకూలంగా మారాయో ఇందులో విశ్లేషించనున్నారు. నకిలీ గుర్తింపులతో ఎదుటివారిని నమ్మించి వందల కోట్లు కొల్లగొట్టిన తీరును ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపనుంది. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్’, ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్’ వంటి డాక్యుమెంటరీలను రూపొందించిన బృందమే దీనిని కూడా తెరకెక్కించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Salman Khan | వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్.. షూటింగ్‌లోనే కోటి రూపాయల వాచ్ బహుమతిగా ఇచ్చాడా?
Suryapet | ప్రేమించలేదని దారుణం.. చెప్పుతో విద్యార్థినిపై దాడి..!
Nithiin | క్రేజీ కాంబినేషన్.. మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు రామ్ అబ్బరాజుతో నితిన్ కొత్త సినిమా!
Ramayana | ‘రామాయణ’ ప్రభంజనం.. 21 రోజుల్లోనే ‘పుష్ప-2’ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

