Salman Khan | వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్.. షూటింగ్‌లోనే కోటి రూపాయల వాచ్ బహుమతిగా ఇచ్చాడా?
Salman Khan | బాలీవుడ్లో చాలా కాలంగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్.. ఈసారి తెలుగు దర్శకుడితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం SVC63 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతోంది.
Salman Khan | బాలీవుడ్లో చాలా కాలంగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్.. ఈసారి తెలుగు దర్శకుడితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం SVC63 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే షూటింగ్ సమయంలో చిత్రీకరించిన సన్నివేశాలు, రషెస్ చూసిన సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి పనితీరుకు ముగ్ధుడైనట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడి మేకింగ్ స్టైల్, సన్నివేశాలను తెరకెక్కిస్తున్న విధానం ఆయనకు బాగా నచ్చడంతో వంశీకి ఓ ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వాచ్ విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత దర్శకుడికి ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. కానీ ఇక్కడ సినిమా పూర్తికాకముందే సల్మాన్ ఇంతటి విలువైన గిఫ్ట్ ఇచ్చారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ కోటి రూపాయల వాచ్ బహుమతికి సంబంధించి సల్మాన్ ఖాన్ కానీ, చిత్రబృందం కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. వంశీ పైడిపల్లి అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కమర్షియల్ అంశాలను సమపాళ్లలో చూపించడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు తొలిసారి సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్, అరవింద్ స్వామి, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ‘మాన్స్టర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టైటిల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో ముంబైలో ప్రారంభించారు.. అనంతరం హైదరాబాద్, మనాలి వంటి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి, నిర్మాణానంతర కార్యక్రమాలను వేగంగా నిర్వహించాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 రంజాన్ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. అయితే విడుదల తేదీపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్.. షూటింగ్‌లోనే కోటి రూపాయల వాచ్ బహుమతిగా ఇచ్చాడా?
Suryapet | ప్రేమించలేదని దారుణం.. చెప్పుతో విద్యార్థినిపై దాడి..!
Nithiin | క్రేజీ కాంబినేషన్.. మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు రామ్ అబ్బరాజుతో నితిన్ కొత్త సినిమా!
Ramayana | ‘రామాయణ’ ప్రభంజనం.. 21 రోజుల్లోనే ‘పుష్ప-2’ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
honour killing | ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ప్రేమ విషయం చెప్పడంతో కూతురి హత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

