honour killing | ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ప్రేమ విషయం చెప్పడంతో కూతురి హత్య
Honour killing | ఆదిలాబాద్ నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతులు ఈ నెల 25వ తేదీన తమ కూతురు కళ్యాణి (18)కి వేరే యువకుడితో నిశ్చితార్థం ఖరారు చేశారు. అయితే ఈ నెల 23వ తేదీన కూతురు బాధపడుతూ ఉండడం గమనించిన కైలాస్ విషయమేంటని గట్టిగా నిలదీశాడు.
Honor killing | దేశంలో, రాష్ట్రంలో పరువు హత్యలు కొత్తేమీ కాదని తెలిసిందే. నిత్యం ఎక్కడో ఒక చోట పరువు హత్యా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కులాంతర ప్రేమ, కులాంతర వివాహాలకు సంబంధించి పరువు పోతుందని కన్న పిల్లలను చంపిన ఘటనలు ఉన్నాయి. అయితే దగ్గరి బంధువుల వ్యక్తిని ప్రేమించిందని కన్న కూతురునే కడతేర్చాడు ఓ తండ్రి. ఆమెకు అప్పటికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ కావడమే దీనిక్కారణం..అంతేకాదు పరువు పోతుందనే కూతురుని హత్య చేసినట్టు అంగీకరించడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్, సుమిత్ర దంపతులు ఈ నెల 25వ తేదీన తమ కూతురు కళ్యాణి (18)కి వేరే యువకుడితో నిశ్చితార్థం ఖరారు చేశారు. అయితే ఈ నెల 23వ తేదీన కూతురు బాధపడుతూ ఉండడం గమనించిన కైలాస్ విషయమేంటని గట్టిగా నిలదీశాడు.
కళ్యాణి తాను మేనత్త కొడుకును ప్రేమిస్తున్నానని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కైలాస్ కూతురు నిద్రలో ఉండగా గొంతు నులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్క గదిలోకి తీసుకెళ్లి ఉరివేశాడు. ఉదయం నిద్రలేచిన సుమిత్ర ఉరికి వేలాడుతున్న కూతురిని చూసి తల్లి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు.
అయితే కైలాస్ హడావిడిగా కేవలం 3 గంటల్లోనే కళ్యాణి అంత్యక్రియలు జరిపించడం, లంబాడ సంస్కృతి ప్రకారం పెళ్లికాని అమ్మాయిని ఖననం చేయకుండా దహనం చేయడం లాంటి చర్యలు చూసి అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా తానే పరువు పోతుందని హత్య చేసినట్టు తండ్రి కైలాస్ అంగీకరించాడు.
Read Also :
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ప్రభంజనం.. 21 రోజుల్లోనే ‘పుష్ప-2’ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
honour killing | ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ప్రేమ విషయం చెప్పడంతో కూతురి హత్య
TDP Rigging | ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో.. టీడీపీ గూండాల రిగ్గింగ్
Dorothy | ‘డొరొతీ’ నుంచి డిలీటెడ్ సీన్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.!
Kavya – Anirudh | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ అదిరిపోయే వెడ్డింగ్ ట్రీట్.. భారీ విందుతో పాటు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

