Ramayana | ‘రామాయణ’ ప్రభంజనం.. 21 రోజుల్లోనే ‘పుష్ప-2’ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
Ramayana | నితీశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
నితీశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. దీపావళి కానుకగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం, మొదటి రోజు నుంచే వసూళ్ల పరంగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం మూడు వారాల్లోనే (21 రోజులు) ప్రపంచవ్యాప్తంగా రూ. 1,755.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ (రూ. 1,742 కోట్లు) లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించి, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. దీంతో భారతీయ అత్యధిక వసూళ్ల జాబితాలో ‘దంగల్’ (రూ. 2,070 కోట్లు), ‘ధురంధర్ 2’ (రూ. 1,813.40 కోట్లు), ‘బాహుబలి-2’ (రూ. 1,788 కోట్లు) తర్వాతి స్థానాన్ని ‘రామాయణ’ కైవసం చేసుకుంది. ‘పుష్ప-2’ ఐదో స్థానానికి పరిమితమైంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కైకేయి పాత్రలో లారా దత్తా, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ మెరిశారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన సంగీతం ఈ దృశ్యకావ్యానికి ప్రధాన బలంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ప్రభంజనం.. 21 రోజుల్లోనే ‘పుష్ప-2’ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు!
honour killing | ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ప్రేమ విషయం చెప్పడంతో కూతురి హత్య
TDP Rigging | ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో.. టీడీపీ గూండాల రిగ్గింగ్
Dorothy | ‘డొరొతీ’ నుంచి డిలీటెడ్ సీన్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.!
Kavya – Anirudh | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ అదిరిపోయే వెడ్డింగ్ ట్రీట్.. భారీ విందుతో పాటు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

