Kavya – Anirudh | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ అదిరిపోయే వెడ్డింగ్ ట్రీట్.. భారీ విందుతో పాటు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్..!
Kavya - Anirudh | సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి వేడుకను కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేయకుండా, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కూడా సంతోషాన్ని పంచుకోవాలని ఈ నూతన దంపతులు నిర్ణయించుకున్నారు.
Kavya – Anirudh | సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి వేడుకను కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేయకుండా, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కూడా సంతోషాన్ని పంచుకోవాలని ఈ నూతన దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని సన్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కోసం భారీ విందును ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ ఏర్పాటు చేసిన ఈ వెడ్డింగ్ ట్రీట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో నూతన దంపతులు ఉద్యోగులతో ఎంతో ఆప్యాయంగా గడిపారు. కేవలం విందు ఏర్పాటు చేసి తమ పని అయిపోయిందనుకోకుండా, స్వయంగా ఉద్యోగుల వద్దకు వెళ్లి పలకరించారు. వారితో సరదాగా ముచ్చటిస్తూ సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు చెందిన యజమానులుగా కాకుండా, కుటుంబ సభ్యుల్లా ఉద్యోగులతో కలిసిపోయిన వారి తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమ జీవితంలోని ప్రత్యేకమైన సందర్భంలో ఉద్యోగులను కూడా భాగస్వాములను చేసుకోవడం మంచి మనసుకు నిదర్శనమంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
ఈ వేడుకలో ఏర్పాటు చేసిన భోజన మెనూ కూడా ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా మాంసాహార ప్రియుల కోసం అదిరిపోయే వంటకాలను సిద్ధం చేశారు. ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ, మటన్ సుక్కా, వివిధ రకాల చికెన్ వంటకాలు, రొయ్యల ప్రత్యేక వంటకాలతో ఉద్యోగులకు భారీ విందు ఏర్పాటు చేశారు.ఇక భోజనం తర్వాత డెజర్ట్‌లుగా వేడివేడి గులాబ్ జామున్, ఐస్‌క్రీమ్ వంటి స్వీట్లను అందించారు. ఈ విందుకు సంబంధించిన మెనూ వివరాలు బయటకు రావడంతో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం మాత్రం ఉద్యోగులకు ఇచ్చిన బహుమతులు. పెళ్లి విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలతో పాటు ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా గిఫ్ట్ బాక్స్‌లను పంపించినట్లు సమాచారం. వాటిని తెరిచి చూసిన ఉద్యోగులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఎదురైంది.
ఆ గిఫ్ట్ బాక్సుల్లో ఖరీదైన చాక్లెట్లతో పాటు బంగారు ఉంగరాలు కూడా ఉండటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అందిన గోల్డ్ రింగ్స్‌ను చూపిస్తూ ఉద్యోగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఆనందాన్ని పంచుకోవడంతో పాటు ఉద్యోగులకు ఇలాంటి విలువైన బహుమతులు అందించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Kavya Maran wins the hearts of the employees with her biryani😱
Sun TV employees got such a feast at Anirudh-Kavya’s wedding that even if they felt like quitting their job, they would first think of biryani
Mutton Biryani, Mutton Sukka, Chicken, Prawn and Sweets… a complete Mahakumbh of non-veg was organised!
Some employers make their employees work overtime, here they are being made to fill their stomachs at weddings!
Kavya Maran has a rich heart and a rich biryani menu
— Dr Priyanka (@Dr_Priyanka0) November 26, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya – Anirudh | ఉద్యోగులకు కావ్య మారన్, అనిరుధ్ అదిరిపోయే వెడ్డింగ్ ట్రీట్.. భారీ విందుతో పాటు గోల్డ్ రింగ్స్ గిఫ్ట్..!
KCR | మళ్లీ కేసీఆర్ గెలువాలని పాదయాత్ర చేపట్టిన అదిలాబాద్ యువకుడు
Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం
Anitha Vangalapudi | ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఏపీ హోంమంత్రి ప్రశంసలు.. ఆడపిల్లల కలలపై అద్భుతమైన సందేశమంటూ కామెంట్!
Upendra | రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న రియల్ స్టార్ ఉపేంద్ర.. కొత్త సినిమాపై కీలక ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

