KCR | మళ్లీ కేసీఆర్ గెలువాలని పాదయాత్ర చేపట్టిన అదిలాబాద్ యువకుడు
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటూ ఆదిలాబాద్‌లోని గిమ్మా గ్రామానికి చెందిన జరా ప్రశాంత్ గిమ్మ గ్రామం నుండి పాద యాత్రను ప్రారంభించాడు.
ఆదిలాబాద్ : మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటూ ఆదిలాబాద్‌లోని గిమ్మా గ్రామానికి చెందిన జరా ప్రశాంత్ గిమ్మ గ్రామం నుండి పాద యాత్రను ప్రారంభించాడు. మాజీ మంత్రి జోగు రామన్న పాదయాత్ర కార్యక్రమానికి హాజరై జండా ఊపి ప్రారంభించారు. మొదట హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రామన్నమాట్లాడుతూ నేడు గిమ్మ గ్రామం నుండి చేపట్టిన ఈ పాదయాత్ర యాదగిరిగుట్ట వరకు కొనసాగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రైతుల పట్ల వ్యవహరిస్తున్న విధి విధానాలపై యావత్ రైతాంగం అసంతృప్తిగా ఉందన్నారు.
కాంగ్రెస్, బిజెపిల పాలనలో ఇటు రైతాంగంతో పాటు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మనసు చలించిన జార ప్రశాంత్ తీసుకున్న నిర్ణయం కఠినమైనప్పటికీ తన సాహసోపేత నిర్ణయానికి ధైర్యంగా నిలబడతామని భరోసా కల్పించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ చేపడుతున్న ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని తన కుటుంబ సభ్యులతో సైతం బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | మళ్లీ కేసీఆర్ గెలువాలని పాదయాత్ర చేపట్టిన అదిలాబాద్ యువకుడు
Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం
Anitha Vangalapudi | ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఏపీ హోంమంత్రి ప్రశంసలు.. ఆడపిల్లల కలలపై అద్భుతమైన సందేశమంటూ కామెంట్!
Upendra | రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న రియల్ స్టార్ ఉపేంద్ర.. కొత్త సినిమాపై కీలక ప్రకటన!
Biker | నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న బైకర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

