Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
Congress | కాంగ్రెస్ పార్టీలో మరో వర్గపోరుకు తెరలేసింది. నిన్న మొన్న మాజీ మంత్రి కొండా సురేఖ ఉదంతం మరవక ముందే తాజాగా మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య వివాదం ముదురుతున్నది.
Congress | కాంగ్రెస్ పార్టీలో మరో వర్గపోరుకు తెరలేసింది. నిన్న మొన్న మాజీ మంత్రి కొండా సురేఖ ఉదంతం మరవక ముందే తాజాగా మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య వివాదం ముదురుతున్నది. నిన్న(బుధవారం) మంథనిలో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ఫిర్యాదు చేశారు. శిలాఫలకంలో సంబంధిత శాఖల మంత్రుల పేర్లు లేవని ఆరోపించారు. కాగా, మంచిర్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్), అసమ్మతి నేత జగన్మోహన్రావు (జగన్) రెండు వర్గాలుగా చీలిపోయారు. మంచిర్యాలలో వెంకటస్వామి విగ్రహావిష్కరణ వ్యవహారం మరువకముందే.. మంచిర్యాలకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, లక్షెట్టిపేటకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, దండేపల్లికి చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఉపసర్పంచ్లు, మాజీ సర్పంచ్ శుక్రవారం జగన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలువడంతో వర్గవిభేదాలను బట్టబయలు చేశాయి. ఇవి మరవకముందే నేడు మంత్రి, ఎంపీ మధ్య వివాదాలు పొడసూపడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
COPD | సీవోపీడీ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి..?
Congress | మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. సీఎస్‌కు ఫిర్యాదు
Bandi Bhagirath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు సమన్లు జారీ
Dasoju Shravan Kumar | భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కునిస్తుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Love, Scam Aur Dhokha | మహా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

