Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Abhijeet Dipke | పోలీసులు లుకౌట్ నోటీస్ జారి చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’ అని ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన అన్నారు.
ముంబై: పోలీసులు లుకౌట్ నోటీస్ జారి చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’ అని ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన అన్నారు. (Abhijeet Dipke) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో1956లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన సంవిధాన్ చౌక్‌లో గురువారం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ అన్న పేరుతో నిరసన ర్యాలీని సీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అభిజిత్ దీప్కే ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. దేశంలోని ప్రతి సంస్థను కేంద్రం హైజాక్ చేసిందని విమర్శించారు. ‘మేము వెనకడుగు వేయం. ప్రజలు 12 ఏళ్లుగా భయంతో బతికారు. కానీ జంతర్ మంతర్ నిరసన వారికి గొంతుకను తిరిగి ఇచ్చింది’ అని ఆయన అన్నారు.
కాగా, సీజేపీ నేతలపై ముంబై పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీస్ గురించి అభిజిత్ దీప్కే మాట్లాడారు. ‘నాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉన్నది. వారు నా కోసం వెతుకుతున్నారు. అభిజిత్ దీప్కే ఎక్కడా? నేను ఇక్కడే సంవిధాన్ చౌక్‌లో ఉన్నాను. మీరేం చేస్తారు? నన్ను అరెస్ట్ చేయండి. నేను రెండుసార్లు జైలుకు వెళ్లాను. నాకు జైలు భయాన్ని చూపించకండి’ అని అన్నారు.
మరోవైపు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దేశాన్ని నాశనం చేశారంటూ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై అభిజిత్ దీప్కే మండిపడ్డారు. ‘ఇకపై దీనిని సహించరు. మరో రెండేళ్లపాటు ఎంత కావాలంటే అంత భయాన్ని సృష్టించుకోండి. 2029 సమీపిస్తోంది. జంతర్ మంతర్ నిరన తర్వాత వచ్చిన భారతదేశం ఇది’ అని ఆయన అన్నారు.
అయితే లుకౌట్ నోటీస్ ఉన్న మరో సీజేపీ నేత అశుతోష్ రాంకా కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. నేడు జరుగుతున్న పోరాటం కేవలం రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాదని అన్నారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే, దేశాన్ని కూడా కాపాడుకోలేం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

