ముంబై: ఒక మహిళ తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణించింది. అయితే కదులుతున్న రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ద్వారా మ్యాగీ నూడుల్స్ వండింది. ( Woman Cooked Maggi In Train) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రైల్వే కూడా స్పందించింది. మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం రైలులో ప్రయాణించింది. ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్న ఆ కుటుంబానికి చెందిన మహిళ కదులుతున్న రైలులో ఇన్స్టంట్ నూడుల్స్ వండింది. ఆ కోచ్‌లోని స్విచ్‌కు తగిలించిన ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారు చేసింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రైలులో భద్రతా ప్రమాణాలు పాటించని ఆ మహిళపై విమర్శలు వెల్లువెత్తాయి. మిగతా రైలు ప్రయాణికులకు హాని తలపెట్టేలా ఉన్న ఆమె చర్యపై నెటిజన్లు మండిపడ్డారు.
మరోవైపు సెంట్రల్ రైల్వే కూడా ఈ సంఘటనపై స్పందించింది. రైలు లోపల ఎలక్ట్రానిక్ కెటిల్ ఉపయోగించడం నిషేధమని తెలిపింది. ‘ఇది సురక్షితం కాదు, చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరం. ఇది అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. ఇతర ప్రయాణికులకు కూడా హానికరం’ అని పేర్కొంది. ఆ ప్రయాణికురాలిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
Action is being initiated against the channel and the person concerned.
Using electronic kettle inside trains is strictly prohibited.
It is unsafe, illegal, and a punishable offence. It can lead to fire incidence and be disastrous for other passengers also.
May also cause… https://t.co/di9vkxrDLv— Central Railway (@Central_Railway) November 21, 2025
Also Read:
Arms Racket Busted | చైనా, టర్కీలో తయారై పాక్ నుంచి సరఫరా.. అంతర్జాతీయ ఆయుధ రాకెట్ గుట్టురట్టు
Sensitive Naval Data Leaked To Pak | నేవీ కీలక సమాచారం పాక్‌కు లీక్.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్