Babli Project | గోదావరి నదిపై నిర్మించిన మహారాష్ట్రలోని అక్రమ ప్రాజెక్టు బాబ్లీ నుంచి మహారాష్ట్ర – తెలంగాణ ఇరిగేషన్ అధికారులు దిగువకు 0.60 టీఎంసీల నీళ్లను వదిలిపెట్టారు. ఏటా వేసవికాలంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు బాబ్లీ గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.
మార్చి 1వ తేదీన గేట్లు ఎత్తాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున ఈ మేరకు ఆదివారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టు దిగువ గోదావరి నదిలోకి నీళ్లను వదిలారు. ఈ జలాలు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు చేరుకోనున్నాయి. ఎస్ఆర్ఎస్పీ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్రజల వనరుల సంఘం అధికారుల సమక్షంలో గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
Supritha | అమ్మ సంతోషమే ముఖ్యం .. సురేఖ వాణి రెండో పెళ్లిపై సుప్రీత భావోద్వేగ వ్యాఖ్యలు
Iran vs US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. దేశం నుంచి 444 విదేశీ విమానాలు రద్దు
Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!