Kara release Announcement | ధనుష్ ‘కారా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో దిగుతున్న కరసామి!
Dhanush | తమిళ స్టార్ నటుడు ధనుష్, 'పోర్ తోజిల్' ఫేమ్ విఘ్నేష్ రాజా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కారా' (Kara) విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.
Dhanush New Movie | తమిళ స్టార్ నటుడు ధనుష్, ‘పోర్ తోజిల్’ ఫేమ్ విఘ్నేష్ రాజా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కారా’ (Kara) విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వేల్స్ యూనివర్సిటీలో జరిగిన ‘వేల్స్ నక్షత్ర 2026’ వేడుకల్లో నిర్మాత ఐషారి కె. గణేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధనుష్‌తో ‘వడ చెన్నై 2’ చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ప్రస్తుతానికి ‘కారా’ సినిమాను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ సినిమాలో ధనుష్ ‘కరసామి’ అనే పత్తి రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ధనుష్ లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతోంది. మలయాళ బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా.. జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజారమూడు, కరుణాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో ‘పోర్ తోజిల్’ వంటి సూపర్ హిట్ థ్రిల్లర్‌ను అందించిన విఘ్నేష్ రాజా – ఆల్ఫ్రెడ్ ప్రకాష్ ద్వయం ఈ చిత్రానికి కథను అందించారు.
#Kara — release date announced April 30. pic.twitter.com/IDsCHqIfkh
— Lets Cinema (@letscinema) February 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

