Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దాదా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు వస్తున్న రెండో సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దాదా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు వస్తున్న రెండో సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిజానికి ‘దాదా’ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ మొదటి నుంచి ప్లాన్ చేశారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నారనే ప్రచారం జరిగింది. దీంతో డిసెంబర్లో బాలయ్య సినిమాను చూడాలనుకున్న నందమూరి అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.
తాజాగా ఈ వార్తలన్నింటికీ చిత్రబృందం చెక్ పెట్టింది. సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్‌ను మరోసారి షేర్ చేస్తూ విడుదల తేదీపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 24నే ‘దాదా’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘డిసెంబర్ 24న షెహరంతా అదిరిపోవాలి.. బాక్సాఫీస్ బద్దలైపోవాలి’ అంటూ మేకర్స్ చేసిన ప్రకటన నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో సినిమా వాయిదా పడుతుందన్న ప్రచారానికి తెరపడింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో బాలకృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాలో విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్ డెడికేషన్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు గాయమైనట్లు సమాచారం.
అయితే గాయం కారణంగా షూటింగ్ ఆగిపోకూడదని, అనుకున్న సమయానికి సినిమా పూర్తి కావాలనే ఉద్దేశంతో మనోజ్ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య వచ్చే క్లైమాక్స్ ఫైట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు విడుదల తేదీపై క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందంగా ఉన్నప్పటికీ, సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ ముగియడంతో విడుదలకు కేవలం 24 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రమోషన్స్ వేగం పెరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 16న ‘దాదా’ ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

